Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నేను 'పిన్ని' అని పిలిస్తే కరీనా భరించలేదు.. నెటిజన్లని ఫిదా చేస్తున్న సైఫ్ కూతురు!
బాలీవుడ్ లో కొత్త తరం హీరోయిన్ల హవా మొదలైనట్లు కనిపిస్తోంది. దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లంతా సీనియర్లుగా మారిపోయారు. బాలీవుడ్ లోకి ఇప్పుడిప్పుడే కొత్త రక్తం చేరుతోంది. దిగ్గజ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇటీవలే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ సినీరంగ ప్రవేశం చేసేందుకు సిద్ధం అవుతోంది. సారా అలీఖాన్ నటించిన కేదర్ చిత్ర త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సారా అలీఖాన్ కాఫీ విత్ షోలో పాల్గొంది. ఈ ఒక్క షో తో సారా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.
ఆశ్చర్యపరిచే వాగ్దాటి
సారా అలీఖాన్, సైఫ్ అలీఖాన్ కలసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో సారా అలీఖాన్ వాగ్దాటి, ఆత్మవిశ్వాసం, అందమైన చిరునవ్వులు గమనించిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సారా అలీఖాన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఎలాంటి విషయం గురించి అయినా చాలా సింపుల్ గా మాట్లాడగలిగే లక్షణం సారా అలీఖాన్ సొంతం అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
పిన్ని అని పిలిస్తే భరించలేదు
ఈ షోలో కరణ్ జోహార్ పలు విషయాలు ప్రస్తావనకు తీసుకుని వచ్చారు. వాటిపై తనదైన శైలిలో జోకులు పేల్చిన సారా నవ్వులు పూయించింది. కరీనా కపూర్ సారాకు సవతి తల్లి. కరీనా గురించి సారా అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కరీనాని నాన్న నాకు ఎప్పుడూ పిన్నిగా పరిచయం చేయలేదు. ఒకే వేళ నేను పిన్ని అని పిలిచినా ఆమె గుండె పగిలిపోతుంది అంటూ నవ్వుతూ తెలిపింది. పోనీ ఆంటీ అని పిలుద్దామంటే నాన్న ఒప్పుకోరు అంటూ సరదాగా చెప్పింది.
స్నేహంగా ఉండాలి
నీకు గొప్ప తల్లి ఉంది. ఆ విషయం నాకు తెలుసు. కానీ మనమంతా స్నేహంగా ఉండాలి అనేది నా ఉద్దేశం అంటూ కరీనా స్వయంగా తనతో తెలిపిందని సారా పేర్కొంది. నాన్న కరీనాని రెండో తల్లిగా నాకు పరిచయం చేయలేదు. అది నాకు కూడా అసౌకర్యంగానే ఉంటుంది అని సారా తెలిపింది. ప్రతి విషయంలో సారా అలీఖాన్ ఇంత స్పష్టతతో, మెచ్యూరిటీతో ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. యువతిగా చలాకీగా ఉంటూనే కుటుంబాన్ని కూడా బాగా అర్థం చేసుకుని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
|
పదేళ్ళపాటు సారా హవా
పలువురు నెటిజన్లు కాఫీ విత్ కరణ్ షోలోకి సారా అలీఖాన్ ని గమనించిన తరువాత ఈ విధంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటినుంచి పదేళ్ల పాటు బాలీవుడ్ లో సారా అలీఖాన్ నెం 1 స్థానంలో కొనసాగుతుంది. అందం, ఆత్మవిశ్వాసం, వాక్చాతుర్యం, నిజాయతీ లాంటి అంశాలు ఆమెలో పుష్కలంగా కనిపిస్తున్నాయి అంటూ ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు.
|
బాలీవుడ్లో కొత్త వాల్కెనో
సారా అలీఖాన్ రూపంలో బాలీవుడ్ లోకి కొత్త వాల్కేనో వచ్చింది. ఆమె సెన్స్ ఆఫ్ హ్యూమర్ అద్భుతం. సారా అలీఖాన్ ప్రభావం బాలీవుడ్ లో చాలా ఎక్కువగా ఉంటుంది అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. కేవలం 49 నిమిషాల సమయంలో సారా అలీఖాన్ కు అభిమానిగా మారిపోయాయి. ఆమె స్టార్ డమ్ లో సరికొత్త శిఖరాలని చేరుకుంటుంది. త్వరలో మీ అందరి హృదయాల్ని గెలుచుకోవడం ఖాయం అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.