అప్పట్లో నా బరువు 96 కేజీలు.. ఇష్టం వచ్చినట్లు తినడం వల్లే, అమ్మ గుర్తుపట్టలేదు!
సైఫ్ అలీఖాన్ ముద్దుల కుమార్తె సారా అలీఖాన్ బాలీవుడ్ లోకి వచ్చి రాగానే అదరగొట్టేస్తోంది. ఆకట్టుకునే అందంతో పాటు సారా మంచి మాటకారి కూడా. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోతో చాలా మంది సారాకు అభిమానులుగా మారిపోయారు. సారా అలీఖాన్ నటించిన డెబ్యూ మూవీ కేదర్ నాథ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుశాంత్ సింగ్ సరసన సారా ఈ చిత్రంలో నటించింది. మరో వైపు రణవీర్ సింగ్ సరసన నటించిన సింబా చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఓ ఇంటర్వ్యూలో సారా మాట్లాడుతూ తాను అధిక బరువు నుంచి ఎలా నాజూగ్గా మారానో తెలిపింది.

చిన్నప్పటి నుంచే
తాను చిన్నప్పటి నుంచే కాస్త బొద్దుగా ఉండేదాన్ని. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళా. అక్కడ లభించే ఆహార పదార్థాలు తిని ఇంకా లావైపోయా అని సారా అలీఖాన్ తెలిపింది. అమెరికాలో పిజ్జాలు, సలాడ్ లు, చాక్లెట్స్ ఎక్కువగా తినడంతో విపరీతంగా లావైపోయానని సారా అలీఖాన్ వివరించింది.

అమ్మకి చెబితే
ఓ దశలో తాను 96 కేజీల బరువు ఉన్నానని సారా అలీఖాన్ తెలిపింది. అమెరికా తిండి ప్రభావంతోనే తాను అంత లావైపోయాని సారా పేర్కొంది. ఆ సమయంలో తాను సినిమాల్లో నటిస్తానని అమ్మకు చెప్పా. ముందు బరువు తగ్గు.. ఆ తర్వాతే సినిమాలు అని చెప్పింది. ఆహారపు అలవాట్లలో మార్పుతోనే బరువు తగ్గడం సాధ్యం అని నిర్ణయించుకున్నా. అప్పటి నుంచే ఫిట్ నెస్ పై దృష్టి పెట్టానని సారా అలీఖాన్ పేర్కొంది.

చేతిలో ఉన్న సూట్‌కేస్ చూసి
దీనితో అమెరికాలో చదువు కొనసాగిస్తూనే మోక్ష సంవత్సరం పాటు కస్టపడి బరువు తగ్గా. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత నా చేతిలో ఉన్న సూట్ కేస్ చూసి మా అమ్మ గుర్తు పట్టింది అని సారా అలీఖాన్ తెలిపింది. నన్ను నన్నుగా గుర్తుపట్టలేకపోయింది అని సారా పేర్కొంది.

కళ్ళు చెదిరే సొగసు
ఒకప్పుడు అంత బరువు ఉన్న సారా అలీఖాన్ ఇప్పుడు కళ్ళు చెదిరే సొగసుతో ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ లో సారా అలీఖాన్ స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయం అని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సరైన హిట్ ఒక్కటి పడితే సారా అలీఖాన్ రేంజ్ మారిపోతుందని అంటున్నారు. సైఫ్ అలీఖాన్, అతని మొదటి భార్య అమృతసింగ్ ముద్దుల కుమార్తె అయిన సారా బాలీవుడ్ లోనే క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది.


Click it and Unblock the Notifications











