బికినీ, బోల్డ్ సీన్స్.. నన్ను కన్విన్స్ చేయాలి అంటున్న స్టార్ హీరో కుమార్తె!
Recommended Video

ప్రస్తుతం బాలీవుడ్ లో ఎవరి నోటా విన్నా సారా అలీఖాన్ మాటే వినిపిస్తోంది. సైఫ్ అలీఖాన్ ముద్దుల కుమార్తె సినీ జనాలని అంతలా మాయ చేస్తోంది. ఇటీవలే సారా అలీఖాన్ నటించిన డెబ్యూ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ఒక్క సినిమాతోనే సారా క్రేజ్ పెరగడానికి కారణం ఉంది. సారా అలీఖాన్ కు ఆకర్షించే అందం ఆమె సొంతం. ఆమె హాస్య చతురత, సమయస్ఫూర్తి ఇలా అన్ని రకాలుగా సారా అలీఖాన్ అభిమానులకు చేరువైంది. ఎలాంటి విషయం గురించి అయినా సారా చాలా సరదాగా తన స్పందన తెలియజేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సాయి అలీఖాన్ మాట్లాడుతూ బోల్డ్ సన్నివేశాలపై తన అభిప్రాయం తెలియజేసింది.

బికినీలో నటించడం
బికినిలో కనిపించడం, బోల్డ్ సన్నివేశాల్లో నటించడంపై మీ కేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అనే ప్రశ్నకు సారా అలీఖాన్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. వాస్తవంగా చెబుతున్నా.. ఇంతవరకు నేను ఎలాంటి సన్నివేశాల్లో నటించాలి, ఎలాంటి సన్నివేశాల్లో నటించకూడదు అని డిసైడ్ కాలేదు. తాను ఇప్పుడిపుడే నటనపై దృష్టి పెడుతున్నానని సారా తెలిపింది.

నన్ను కన్విన్స్ చేయాలి
ఏదైనా సన్నివేశంలో నటించాలి అంటే ముందుగా నన్ను కన్విన్స్ చేయాలి. నేను కన్విన్స్ కాకపోతే అది ఎలాంటి సన్నివేశం అయినా నటించాను అని తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం నటి కన్నా ఓ సినీ అభిమానిగా అన్ని గమనిస్తున్నా అని సారా అలీఖాన్ తెలిపింది. ఈ ఇలాంటి పాత్రలు చేస్తే ఆడియన్స్ ని ఎంటర్ టైం చేయవచ్చు అని నాకు అనిపించాలి. అలాంటి పాత్రల్లో ఇంకా ఎక్కువ కష్టపడి నటిస్తానని సారా తెలిపింది.

కేదర్‌నాథ్ చిత్రంలో
కేదర్ నాథ్ వరదల నేపథ్యంలో తెరకెక్కిన కేదర్ నాథ్ చిత్రం ద్వారా సారా అలీఖాన్ బాలీవుడ్ కు పరిచయం అయింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సారా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనే ప్రశంసలు దక్కుతున్నాయి. సారా నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. అభిషేక్ కపూర్ తెరకెక్కించిన కేదర్ నాధ్ చిత్రం మంచి విజయం సాధించింది.

మరో బడా చిత్రం
సారా అలీఖాన్ త్వరలో మరో బడా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రణవీర్ సింగ్ నటిస్తున్న చిత్రం కావడం, తెలుగు టెంపర్ చిత్రానికి రీమేక్ గా వస్తుండడంతో సింబాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చితం విజయం సాధిస్తే సారా బాలీవడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం. డిసెంబర్ 28న సింబా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











