లిప్ కిస్ పెట్టడం చాలా సులభం.. నిజమైన లవర్‌లాగే అతడితో, స్టార్ హీరో కుమార్తె హాట్ కామెంట్స్!

దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లాంటి హాట్ హీరోయిన్లు ఇప్పటి వరకు బాలీవుడ్ ని ఏలారు. వీరి హవా ముగింపు దశకు చేరుకుంది. బాలీవుడ్ లోకి యువ హీరోయిన్లు వస్తున్నారు. వీరిలో చాలా మంది ఫ్యూచర్ స్టార్స్ గా చెప్పబడుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆమె నటించిన ఒక్క చిత్రం కూడా విడుదల కాకముందే బాలీవుడ్ వర్గాలు సారా గురించి చర్చించుకుంటుండడం విశేషం. సారా అలీఖాన్ నటించిన కేదర్ నాథ్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓ ఇంటర్వ్యూలో సారా అలీఖాన్ చేసిన బోల్డ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అందం మాత్రమే కాదు

అందం మాత్రమే కాదు

సారా అలీఖాన్ చాలా రోజులుగా బాలీవుడ్ ఈవెంట్స్ లో కనిపిస్తుంది. ఆమె కేవలం సైఫ్ కుమార్తె గానే తెలుసు. ఆకర్షించే అందం ఉండడంతో మంచి హీరోయిన్ అవుతుందని అంతా అంచనా వేశారు. కానీ ఇలా ఆమె గురించే మాట్లాడుకునేంతగా ఫేమస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. కాఫీ విత్ కరణ్ షో, కేదర్ నాథ్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఈ అమ్మడి టాలెంట్ మొత్తం బయట పడింది. అద్భుతమైన హాస్య చతురత, అనర్గళంగా మాట్లాడే స్వభావంతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.

 ఫ్యూచర్ స్టార్

ఫ్యూచర్ స్టార్

అందం, చలాకీతనం పుష్కలంగా ఉండడంతో భవిష్యత్తులో కాబోయే బాలీవుడ్ నెం1 హీరోయిన్ అంటూ సారా గురించి అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఎలాంటి విషయం గురించి అయినా సమయస్ఫూర్తితో స్పందించడం, ధైర్యంగా తన అభిప్రాయాలని చెప్పగలగడంతో సారా అలీఖాన్ అభిమానులందరికి నచ్చేస్తుంది. కేదర్ నాథ్ చిత్రంలో లిప్ లాక్ సన్నివేశం ఉంది. ఆ సన్నివేశం గురించి తన మనసులో అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసింది.

హాట్ కామెంట్స్

హాట్ కామెంట్స్

నటిగా నాకు కొన్ని భాద్యతలు ఉంటాయి. సన్నివేశం బాగా రావాలి. అది ఎలాంటి సన్నివేశం అయినా వెండి తెరపై పండితేనే అర్థం ఉంటుంది. ఆ పాత్రకు తగ్గట్లుగా ఆ సమయంలో నేను అలా మారిపోవాలి. వాస్తవం చెబుతున్నా.. కేదర్ నాథ్ చిత్రంలో లిప్ లాక్ సన్నివేశంలో చాలా సులభంగా నటించా. ఒకరిపై ప్రేమని తెలపడానికి లిప్ కిస్ అనేది సులభమైన మార్గం. అందులో ప్రేమ తీవ్రత కనిపిస్తుంది. సెట్ లో ఎంతమంది ఉన్నా నాకు భయం అనిపించలేదు.

 నిజమైన ప్రేమికుడిగానే

నిజమైన ప్రేమికుడిగానే

ఆ సన్నివేశంలో నటించే సమయంలో సుశాంత్ ని నా నిజమైన ప్రేమికుడిగానే భావించా. అలా అనుకుంటేనే ఆ సన్నివేశం అంత సులభంగా, అద్భుతంగా వచ్చిందని సారా తెలిపింది. ఈ మతాల బట్టే అర్థం చేసుకోవచ్చు.. సారా ధైర్యం, సినిమాలపై ఆమె కమిట్మెంట్ ని. సినిమా మొత్తం సుశాంత్, తనకు మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని సారా తెలిపింది.

అభిప్రాయాలు కలిశాయి

అభిప్రాయాలు కలిశాయి

సుశాంత్ మాట్లాడుతూ.. సారా చాలా విషయాల్లో నాలాగే ఆలోచిస్తుంది. మా ఇద్దరి అభిప్రాయాలు కలిసాయి. కేదర్ నాథ్ చిత్రంలో సారాతో నటించడం గొప్ప అనుభూతి అని సుశాంత్ తెలిపాడు. కథలోని లోపాలని కూడా సారా ఇట్టే పసిగట్టేస్తుందని, ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రశంసతో ముంచెత్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X