Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
బికినిలో షాక్ ఇచ్చిన స్టార్ హీరో కూతురు.. స్విమ్మింగ్ పూల్ లో మరో మహిళను తోసేస్తూ చెత్త ప్రాంక్!
సినిమా పరిశ్రమలో అందరూ కూడా జనాల్లో ఎక్కువగా క్రేజ్ అందుకోవాలని తాపత్రయపడుతుంటారు. ముఖ్యంగా గ్లామరస్ హీరోయిన్స్ అయితే సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా వారి ఫ్యాన్ ఫాలోవర్స్ పెంచుకోవాలని అడుగులు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారు పోస్ట్ చేసే ఫోటోలు వీడియోలు కూడా భిన్నంగా ఉండాలి అని ఆలోచిస్తారు. ఇక ఇటీవల ఒక స్టార్ హీరో కూతురు చాలా గ్లామరస్ గా కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. ఇక ఆ బికినీ లోనే ఆమె ఒక మహిళ తో చేసిన ప్రాంక్ సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ కి గురి అవుతోంది. వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో మంచి క్రేజ్
సారా అలీ ఖాన్ గురించి తెలియని నెటిజన్లు ఉండరు అనే చెప్పాలి. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో జనాలను ఎక్కువగా ఆకట్టుకోవడానికి తన అందాలతో నిత్యం వైరల్ అవుతూనే ఉంటుంది. ఎలాంటి పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అయ్యే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది అని చెప్పవచ్చు. ఒక విధంగా తన గ్లామర్ తోనే సారా అలీఖాన్ సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

హాట్ ఫొటో షూట్స్
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కూతురు అయిన సారా అలీ ఖాన్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ గా క్రేజ్ అందుకునేందుకు బాగానే ప్రయత్నం చేస్తోంది. ఈ బ్యూటీకి ఇంకా అనుకున్నంత స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ రాకపోయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. హాట్ గ్లామర్ తో ఫోటో షూట్స్ తో ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటుంది.

మొదటి సినిమా సుశాంత్ తో..
ఇక అప్పుడప్పుడు సారా అలీ ఖాన్ బికినీ షోతో కూడా షాక్ ఇస్తుంది. స్టార్ హీరో కూతురు అయినప్పటికీ కూడా నేటి తరం హీరోయిన్ల తరహాలోనే గ్లామర్ డోసు కూడా పెంచుతుంది. ఇక మొదటగా సుశాంత్ రాజ్ పుత్ తో నటించిన విషయం తెలిసిందే. అతనితో చేసిన కేదార్నాథ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సారా అలి ఖాన్ కి బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వచ్చాయి.

బికినిలో ప్రాంక్
ఇక సారా అలీఖాన్ ఇటీవల ఒక ప్రాంక్ కూడా చేసింది. ఒక మహిళ తో ఫొటోకి స్టిల్ ఇస్తున్నట్లుగా పోజ్ ఇస్తూ ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్ లోకి తోసేసింది. ఇక అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సారా అలీ ఖాన్ బికినీలో కనిపించడంతో కుర్రాళ్ళు కొంటెగా కామెంట్స్ కూడా చేస్తున్నారు.
చెత్త ప్రాంక్ అంటూ
ఇక ఇన్స్టాగ్రామ్ లో ముచ్చటించిన అనంతరం అమ్మడు ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చింది. నిజంగా అది ఒక చెత్త ప్రాంక్ అంటూ తనకు తానే కామెంట్ చేసుకుంది. ఇక ప్రస్తుతం ఆ విడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఇక బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న సారా అలీ ఖాన్ తన తదుపరి సినిమాను లూకా చూపి దర్శకుడితో చేయనుంది. అలాగే మరో రెండు సినిమాలను చేసేందుకు కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.