షూటింగ్ మధ్యలోనే డ్రగ్స్ తీసుకుకేవాడు.. వీళ్ళు కూడా సుశాంత్‌నే ఇరికిస్తున్నారా?

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ హీరోయిన్స్ విచారణ శనివారంతో ఒక దశ ముగిసినట్లు తెలుస్తోంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్స్ స్టార్స్ ని పిలిచి స్పెషల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న విషయం తెలిసిందే. దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ ల విచారణ ముగిసిన తరువాత వారి గురించి అనేక రకాల వార్తలు మరోసారి వైరల్ గా మారుతున్నాయి. ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు కూడా సుశాంత్ పైనే ఆరోపణలు చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

డెత్ మిస్టరీని పట్టించుకోకుండా

డెత్ మిస్టరీని పట్టించుకోకుండా

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించినప్పుడు ఒక సూసైడ్ కేసుగా నమోదైన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత అసలు డెత్ మిస్టరీని పట్టించుకోకుండా అధికారులు వేరే విషయాలపై ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ కేసుపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు అర్ధమవుతోంది. హీరోయిన్స్ కి సమన్లు జారీ చేసినప్పటి నుంచి కేసు అనేక రకాల మలుపులు తిరుగుతోంది.

నన్ను ఇరికించి వెళ్లిపోయాడు

నన్ను ఇరికించి వెళ్లిపోయాడు

ఇక సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో జైలు జీవితాన్ని చూస్తోంది. బెయిల్ దొరికితే వీలైనంత త్వరగా ఈ కేసు నుంచి బయటపడాలని అనుకుంటోంది. అయితే బెయిల్ పిటిషన్ లో ఆమె సుశాంత్ తనను బుక్ చేశాడని ఆరోపించడం షాక్ కి గురి చేసింది. అతను డ్రగ్స్ కి లోనై తనను ఇరికించి వెళ్లిపోయాడని అతను డ్రగ్స్ విషయంలో నన్ను బాగా యూజ్ చేసుకున్నట్లు కూడా చెప్పింది.

షూటింగ్ బ్రేక్ లో డ్రగ్స్

షూటింగ్ బ్రేక్ లో డ్రగ్స్

సుశాంత్ బ్రతికి ఉంటే అసలు నిజాలు బయటకు వచ్చేవాని రియా పేర్కొన్న విధానం వైరల్ అవ్వగా ఇప్పుడు NCB ఇన్వెస్టిగేషన్ లో సారా అలీ ఖాన్, శ్రద్దా కపూర్ వంటి హీరోయిన్స్ సుశాంత్ షూటింగ్స్ మధ్యలోనే డ్రగ్స్ తీసుకునేవాడని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. విచారణలో వారు కూడా రియా తరహాలోనే సుశాంత్ పై డ్రగ్స్ ఆరోపణలు చేసినట్లు బాలీవుడ్ మీడియాలో అనేక రకాల కథనాలు పుట్టుకొస్తున్నాయి.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
అవి డ్రగ్స్ కాదు.. సిగరెట్ మాత్రమే

అవి డ్రగ్స్ కాదు.. సిగరెట్ మాత్రమే

ఎక్కువగా సుశాంత్ సింగ్ ఫామ్ హౌజ్ లో పార్టీలు జరిగేవని అక్కడికి కొంతమంది సినీ తారలు కూడా వచ్చేవారని శ్రద్దా, సారా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ తాము మాత్రం డ్రగ్స్ తీసుకోలేదని బలంగా చెప్పారట. అయితే సారాకి సంబంధించిన కొన్ని స్మోకింగ్ ఫొటోలను చూపించిన అధికారులు వాటిపై పలు ప్రశ్నలు అడుగగా.. అది సిగరెట్ మాత్రమేనని వివరణ ఇచ్చినట్లు టాక్. ఇక దీపికా కూడా డ్రగ్స్ ఆరోపణలు అబద్ధమని తన ఆరోగ్య రీత్యా అలాంటి వాటికి దూరంగా ఉంటానని ఆమె అధికారులకు వివరణ ఇచ్చినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X