ఛీ..ఛీ.. తమ్ముడితో ఇలాంటి పనులేంటి? షాకింగ్ పిక్స్.. హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్
ఓ ఫోటో చూస్తే అందులో ఉన్న అబ్బాయి, అమ్మాయిల మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పే అవకాశం ఉంటుంది. వారిద్దరు వేసుకున్న దుస్తులు, వారిచ్చిన పోజుల ఇలా ఏదో ఒక క్లూతో వారిద్దరి రిలేషన్ ఏమై ఉంటుందా? అని ఊహించవచ్చు. అయితే తాజాగా ఓ హీరోయిన్ షేర్ చేసిన పిక్స్, వారిద్దరి మధ్య ఉన్న సంబంధం తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకీ ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

పటౌడీ ఫ్యామిలీలో..
సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌లకు పుట్టిన పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్. ప్రస్తుతం ఈ ఇద్దరు బాలీవుడ్‌లో బిజీగానే ఉన్నారు. సారా అలీ ఖాన్ అయితే ఇంకాస్త జోరు మీదుంది. అయితే వీరిద్దరిపై సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది.
సక్సెస్‌లతో జోష్..
కేదార్‌నాథ్ అంటూ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సింబా అంటూ రణ్వీర్ సింగ్‌తో ఆడిపాడింది సారా అలీ ఖాన్. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్నే అందుకున్నాయి. తాజాగా లవ్ ఆజ్ కల్ 2 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా అంతగా మెప్పించకపోయినా.. సారాకు మాత్రం మంచి పేరే వచ్చింది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ ఆమెకు తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి.

సోదరుడికి విషెస్..
సారా.. తన సోదరుడు ఇబ్రహీమ్ అలీ ఖాన్‌కు ఎంతో ప్రేమగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఆమె షేర్ చేసిన ఫోటోలు, దిగిన లొకేషన్స్, నిల్చున్న పోజులు, వేసిన చోటే నిరభ్యంతంరంగా ఉంది. వీటిపైనే నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Recommended Video


ఛీ..ఛీ.. సోదరుడితో ఇలాగేనా..?
సారా చెప్పిన విషెస్, షేర్ చేసిన ఫోటోలు వివాదానికి దారి తీశాయి. అక్కాతమ్ముడు బికినీలో ఏంటి? అలా చేయి వేయడం ఏంటి? బికినీలో ఉన్న మొదటి అక్కాతమ్ముడు మీరే.. మీకు ఈ సందర్భంలో షేర్ చేయడానికి ఇలాంటి ఫోటోనే దొరికిందా.. అంటూ చెడమడా తిట్టేస్తున్నారు.


Click it and Unblock the Notifications











