twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ నుంచి అర్ధాంతరంగా స్టార్ సెలబ్రిటీ అవుట్.. తోటి కంటెస్టెంట్ దాడితో గాయం!

    |

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఇటీవల ప్రారంభమైన బిగ్‌బాస్ హిందీ 14 సీజన్ రచ్చ రచ్చగా మారుతున్నది. ఇంటి సభ్యులు రెచ్చిపోయి విమర్శలు చేసుకోవడం, బూతులు తిట్టుకోవడం, ఒకరిపై మరొకరు దాడి చేసుకోనే పరిస్థితులు బిగ్‌బాస్ ఇంటిలో సాక్షాత్కరిస్తున్నాయి. తాజాగా ఇంటిలో జరిగిన టాస్క్ సందర్భంగా టాలీవుడ్ హీరోయిన్ నిక్కి తంబోలి దురుసుగా ప్రవర్తించడంతో పంజాబీ హీరోయిన్, గాయని సారా గుర్‌పాల్ తీవ్రంగా గాయపడటంతో ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించారు. ఆ ఘటన వివరాల్లోకి వెళితే...

    ఇమ్యునిటీ టాస్క్‌లో నిక్కి తంబోలి

    ఇమ్యునిటీ టాస్క్‌లో నిక్కి తంబోలి

    బిగ్‌బాస్ ఇంటిలో గతవారం జరిగిన ఇమ్యునిటీ టాస్క్ సందర్భంగా నిక్కి తంబొలి, సారా గుర్పాల్ కాస్త అగ్రెసివ్‌గా గేమ్ ఆడారు. ఆ సందర్భంగా షార్ప్‌గా ఉన్న నిక్కి తంబోలి చేతి గోర్లు సారా ఇంటిలో గుచ్చుకోవడంతో తీవ్రమైన గాయమైంది. ఓ సందర్భంలో సారాకు క్షమాపణ చెప్పమని నిక్కికి ఇంటి సభ్యుడు ఎజాజ్ సూచించడం కనిపించింది.

    బిగ్‌బాస్ నిర్ణయంతో సీనియర్లు

    బిగ్‌బాస్ నిర్ణయంతో సీనియర్లు

    సారా అనారోగ్యంపై గురించి బిగ్‌బాస్‌ 14 షోలోని ముగ్గురు సీనియర్ సభ్యులు సిద్దార్థ్ శుక్లా, గౌహర్ కాన్, హీనా ఖాన్‌ను బిగ్‌బాస్ నిర్ణయం తీసుకోమన్నారు. అయితే మరో ముగ్గురు ఇంటి సభ్యులతో వారు సంప్రదింపులు జరిపిన తర్వాత సారాను ఇంటి నుంచి పంపించేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఆ తర్వాత సారా కళ్లు విపరీతంగా ఎరుపు ఎక్కాయి. ఈ క్రమంలో ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆమె కొన్నాళ్లు రెస్ట్ అవసరమని సూచించిన నేపథ్యంలో సారా గుర్పాల్‌ను ఇంటికి పంపించారు.

     సారా గుర్పాల్‌ను ఇంటికి పంపించడంపై

    సారా గుర్పాల్‌ను ఇంటికి పంపించడంపై

    అయితే సారాను ఇంటి నుంచి పంపించడంపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. బిగ్‌బాస్‌లో పాల్గొన్న మాజీ సభ్యులు వీజే అండీ, షెఫాలీ బగ్గా లాంటి వారు కూడా ముగ్గురు సీనియర్ల నిర్ణయాన్ని తప్పపట్టారు. ఇలాంటి వివాదాల మధ్య సారా గుర్పాల్ ఇంటిని వీడి తన సొంత ఇంటికి వెళ్తూ కనిపించారు. అయితే తన ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మళ్లీ బిగ్‌బాస్‌కు రావొచ్చు అంటూ వెసలుబాటును ఇవ్వడం గమనార్హం.

    Recommended Video

    Kartik Aaryan Reveals His Crush On Sara Ali Khan !
     ఇంటికి చేరుకొన్న సారా గుర్పాల్

    ఇంటికి చేరుకొన్న సారా గుర్పాల్

    బిగ్‌బాస్ 14 సీజన్‌లో వివాదాస్పద నటి, గాయని సారా గుర్పాల్ గాయంతో తన చంఢీగడ్‌లోని తన నివాసానికి చేరుకొన్నారు. టాస్క్ సందర్భంగా కంటికి గాయమైంది. ఈ క్రమంలో గాయం నొప్పి ఎక్కువగా కావడం, ఆమె అస్వస్థతకు గురి అయ్యారు. నిక్కి తంబొలి దురుసుగా ప్రవర్తించడంపై ఇంటి సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

    English summary
    Punjabi actress and singer Sara Gurpal leaves from Bigg Boss 14 after hurted by contestant Nikki Tamboli. After Bigg Boss asked the three seniors Sidharth Shukla, Gauahar Khan and Hina Khan to take a call. after the decision, Sara Gurpal was spotted leaving to Chandigarh
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X