Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గట్టిగా బంధించేదాన్ని.. ఒక్క పాటైనా చేయాలని కలలు.. సరోజ్ ఖాన్ మృతిపై సెలెబ్రిటీల రియాక్షన్
బాలీవుడ్లో వరుసగా లెజెండరీ ప్రముఖులు మృత్యువాత పడటం జీర్ణించుకోలేకపోతున్నారు. రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ వంటి తారలు నింగికేగిన విషయాన్ని మరవక ముందే.. మరో లెజెండరీ సెలెబ్రిటీ కన్నుమూశారు. తన కొరియోగ్రఫీ దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సరోజ్ ఖాన్ (71) మరణ వార్తతో బాలీవుడ్ శోక సంద్రంలో మునిగింది. నేటి ఉదయం ఆమె గుండేపోటుతో మరణించారు. ఇక సరోజ్ ఖాన్ మృతిపై బాలీవుడ్ మొత్తం స్పందిస్తోంది.
మరోతారను కోల్పోయాం..
సరోజ్ ఖాన్ మృతిపై తాప్సీ స్పందిస్తూ.. ‘మీ కంపెనీలో పని చేస్తే చాన్స్ వస్తే.. ఆ మెమోరీస్‌ను కచ్చితంగా బంధించుకునేదాన్ని, గట్టిగా బంధించేదాన్ని. మరో తారను మనం కోల్పోయాం. ప్రతీ ఒక్క అమ్మాయి మీ పాటల ద్వారా జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటార'ని చెప్పుకొచ్చింది.
ఒక్కపాటైనా చేయాలని..
రకుల్ ప్రీత్ స్పందిస్తూ.. ‘2020 దయచేసి ఇంకా చెడు వార్తలు వినేలా చేయక. సరోజ్ ఖాన్ మరణ వార్త ఎంతో బాధను కలిగిస్తోంది. ఆమెతో ఒక్క పాటకైనా పని చేయాలని ఎల్లప్పుడూ కలలు కనేదాన్ని. మీ గ్రేస్, సినిమాకు మీరు అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మీ కుటుంబానికి బలం చేకూరాల'ని కోరుకుంది.
డ్యాన్స్‌ను సులభంగా మార్చేసింది..
అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. ‘లెజెండరీ కొరియోగ్రఫర్ సరోజ్ ఖాన్ మరణ వార్తతో నిద్ర లేచాను. ఎవ్వరైనా డ్యాన్స్ చేయగలరు అని అనిపించేలా ఆమె చేసింది. ఇండస్ట్రీకి ఆమె ఎంతో శూన్యాన్ని మిగిల్చింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాల'ని కోరుకున్నాడు.
Recommended Video
రెండు వేలకు పైగా..
రితేష్ దేశ్‌ముఖ్ స్పందిస్తూ.. ‘సరోజ్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలి. సినీ ప్రేమికులకు, ఇండస్ట్రీకి మీరు లేని లోటు పూరించలేనిది. రెండు వేల పాటలకు కొరియోగ్రఫీ చేసి.. పాటల రూపురేఖలనే మార్చేసింది. అల్లాదీన్ చిత్రంలో ఆమెతో ఓ పాట చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా బకెట్ లిస్ట్‌లో ఆ ఒక్కటి ఉన్నందుకు సంతోష'మని చెప్పుకొచ్చాడు.