twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గట్టిగా బంధించేదాన్ని.. ఒక్క పాటైనా చేయాలని కలలు.. సరోజ్ ఖాన్ మృతిపై సెలెబ్రిటీల రియాక్షన్

    |

    బాలీవుడ్‌లో వరుసగా లెజెండరీ ప్రముఖులు మృత్యువాత పడటం జీర్ణించుకోలేకపోతున్నారు. రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ వంటి తారలు నింగికేగిన విషయాన్ని మరవక ముందే.. మరో లెజెండరీ సెలెబ్రిటీ కన్నుమూశారు. తన కొరియోగ్రఫీ దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సరోజ్ ఖాన్ (71) మరణ వార్తతో బాలీవుడ్ శోక సంద్రంలో మునిగింది. నేటి ఉదయం ఆమె గుండేపోటుతో మరణించారు. ఇక సరోజ్ ఖాన్ మృతిపై బాలీవుడ్ మొత్తం స్పందిస్తోంది.

    మరోతారను కోల్పోయాం..

    మరోతారను కోల్పోయాం..

    సరోజ్ ఖాన్ మృతిపై తాప్సీ స్పందిస్తూ.. ‘మీ కంపెనీలో పని చేస్తే చాన్స్ వస్తే.. ఆ మెమోరీస్‌ను కచ్చితంగా బంధించుకునేదాన్ని, గట్టిగా బంధించేదాన్ని. మరో తారను మనం కోల్పోయాం. ప్రతీ ఒక్క అమ్మాయి మీ పాటల ద్వారా జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటార'ని చెప్పుకొచ్చింది.

    ఒక్కపాటైనా చేయాలని..

    ఒక్కపాటైనా చేయాలని..

    రకుల్ ప్రీత్ స్పందిస్తూ.. ‘2020 దయచేసి ఇంకా చెడు వార్తలు వినేలా చేయక. సరోజ్ ఖాన్ మరణ వార్త ఎంతో బాధను కలిగిస్తోంది. ఆమెతో ఒక్క పాటకైనా పని చేయాలని ఎల్లప్పుడూ కలలు కనేదాన్ని. మీ గ్రేస్, సినిమాకు మీరు అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మీ కుటుంబానికి బలం చేకూరాల'ని కోరుకుంది.

    డ్యాన్స్‌ను సులభంగా మార్చేసింది..

    డ్యాన్స్‌ను సులభంగా మార్చేసింది..

    అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. ‘లెజెండరీ కొరియోగ్రఫర్ సరోజ్ ఖాన్ మరణ వార్తతో నిద్ర లేచాను. ఎవ్వరైనా డ్యాన్స్ చేయగలరు అని అనిపించేలా ఆమె చేసింది. ఇండస్ట్రీకి ఆమె ఎంతో శూన్యాన్ని మిగిల్చింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాల'ని కోరుకున్నాడు.

    Recommended Video

    Surya Asthamayam Movie Trailer Launch |Trishul Rudra | Himansee Katragadda
    రెండు వేలకు పైగా..

    రెండు వేలకు పైగా..

    రితేష్ దేశ్‌ముఖ్ స్పందిస్తూ.. ‘సరోజ్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలి. సినీ ప్రేమికులకు, ఇండస్ట్రీకి మీరు లేని లోటు పూరించలేనిది. రెండు వేల పాటలకు కొరియోగ్రఫీ చేసి.. పాటల రూపురేఖలనే మార్చేసింది. అల్లాదీన్ చిత్రంలో ఆమెతో ఓ పాట చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా బకెట్ లిస్ట్‌లో ఆ ఒక్కటి ఉన్నందుకు సంతోష'మని చెప్పుకొచ్చాడు.

    English summary
    Saroj Khan Death Taapsee and Rakul Akshay Kumar Reaction. 2020 please don’t give any more bad news . So sad to hear about #SarojKhan ma’am . Always dreamt of doing atleast one song Choreographed by her. Your grace and contribution to indian cinema shall always be remembered. May your soul RIP. Strength to the family
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X