దర్శకుడు సతీష్ కౌశిక్ మరణంపై అనుమానాలు.. పార్టీలో నిషేధిత ఔషధాలు.. ఆ కోణంలో ఢిల్లీ పోలీసుల దర్యాప్తు
బాలీవుడ్ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిక్ మరణం సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేసింది. మార్చి 9వ తేదీన గుండెపోటుతో ఆయన మరణించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మరణానికి ముందు రాత్రి ఢిల్లీలో జరిగిన ఓ పార్టీలో ఆయన పాల్గొన్నారు. పార్టీ జరిగిన ప్రాంతం నుంచి కొన్ని ఔషధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు రావడంతో సతీష్ కౌశ్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోస్టు మార్టమ్‌కు ఆదేశించారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ ఫామ్‌హౌస్‌లో పార్టీ
మార్చి 8వ తేదీ రాత్రి నైరుతి ఢిల్లీలోని ఓ ఫామ్‌హౌస్‌లో పార్టీ జరిగింది. స్నేహితుడి ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన పార్టీలో సినీ ప్రముఖులు, వీఐపీలు పాల్గొన్నారు. ఆ పార్టీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అయితే సతీష్ కౌశిక్ మరణాన్ని అనుమానాస్పద మృతిగా భావిస్తూ ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టు మార్టం రిపోర్టు కోసం వేచి చూస్తున్నారు.

పార్టీలో ఏం జరిగిందంటే?
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు పార్టీలో పాల్గొన్న వ్యక్తులు, ఉపయోగించిన ఆహార పదార్థాలు, ఇతర వ్యవహారాలపై దృష్టిపెట్టి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నివేదికలో వెల్లడయ్యే వివరాలు, అంశాల ఆధారంగా దర్యాప్తు చేస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

అనుమానాస్పద మెడిసిన్స్‌ను స్వాధీనం
సతీష్ కౌశిక్ మరణం తర్వాత అనేక అనుమానాలు రావడంతో ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ సిబ్బందిని ప్రశ్నించి సమాచారాన్ని రాబట్టారు. ఆక్కడ దొరికిన అనుమానాస్పద మెడిసిన్స్‌ను స్వాధీనం చేసుకొని వాటి గురించి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో సతీష్ కౌశిక్ మరణం వెనుక ఏదైనా హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

15 రోజులపాటు అధ్యయనం తర్వాతే
అయితే పోస్టు మార్టమ్ తర్వాత వైద్యులు సమాచారాన్ని వెల్లడించడానికి సమయం తీసుకొంటున్నారు. ఆయన గుండె, రక్త నమూనాలను సేకరించారు. తదుపరి అధ్యయనం కోసం వాటిని పరిగణనలోకి తీసుకొంటామని వైద్యులు తెలిపారు. 15 రోజులపాటు అధ్యయనం చేసిన తర్వాత నివేదికను వెల్లడిస్తాం అని వైద్యులు వెల్లడించినట్టు తెలిసింది.

సతీష్ కౌశిక్ కెరీర్ ఇలా..
సతీష్ కౌశిక్ కెరీర్ విషయానికి వస్తే.. కమెడియన్ తన కెరీర్‌ను బాలీవుడ్‌లో ప్రారంభించారు. ఆ తర్వాత స్క్రీన్ ప్లే రైటర్‌గా, డైరెక్టర్‌గా, నిర్మాతగా అద్బుతమైన చిత్రాలను అందించారు. మిస్టర్ ఇండియా, దీవానా మస్తానా, రామ్ లఖన్, సాజన్ చలే ససురాల్, సినిమాల్లో నటుడిగా ఆలరించారు. పలు చిత్రాల్లో నటించిన ఆయనకు బెస్ట్ కమెడియన్ అవార్డు అందుకొన్నారు.


Click it and Unblock the Notifications











