నేరాలను అంగీకరించలేదు.. బలవంతంగా ఒప్పించారు.. రియా చక్రవర్తి అరెస్ట్‌లో కొత్త ట్విస్టు
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి తన అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో బాలీవుడ్‌లో డ్రగ్ మాఫియా సంబంధాలు బయటకు రావడంతో ఆమెను విచారించి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను నేరం చేయలేదని, బలవంతంగా ఒప్పించారనే కామెంట్ చేయడం చర్చనీయాంశమవుతున్నది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..
Recommended Video

సెప్టెంబర్ 22 వరకు బైకులా జైలులో
డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ 8వ తేదీన రియాను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఆ సమయంలో రియా చేసుకొన్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో 14 రోజులపాటు కస్టడీలోకి తీసుకొని ముంబైలోని బైకులా జైలులోకి తరలించారు. సెప్టెంబర్ 22 వరకు ఎన్సీబీ అధికారులు కస్టడీలో ఉంటారు.

రియా చక్రవర్తితో బలవంతంగా
అయితే తాజాగా రియా చక్రవర్తి కుటుంబ సభ్యులు మరో బెయిల్ పిటిసన్‌ను దాఖలు చేశారు. నా క్లయింట్ రియా చక్రవర్తి ఎలాంటి నేరాన్ని అంగీకరించలేదు. ఎన్సీబీ అధికారులు బలవంతంగా ఆమెను ఒప్పించారు. ఆమెపై తప్పుగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని తాజా బెయిల్ పిటిషన్‌లో ఆమె తరఫు న్యాయవాది సతీష్ మాన్‌షిండే పేర్కొన్నారు.

సుప్రీం నిబంధనలు తుంగలో తొక్కారు
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని విచారించే క్రమంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎన్సీబీ తుంగలో తొక్కారు. రియాను ప్రశ్నించేటప్పుడు ఆమె వెంట కనీసం ఓ మహిళా అధికారి ఉండాలనే నిబంధనను పాటించలేదు. షీలా బోర్సే వర్సెస్ మహారాష్ట్ర కేసులో స్త్రీలను విచారించేటప్పుడు మహిళా ఆఫీసర్లు, పోలీస్ కానిస్టేబుల్ ఉండాలని ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని బెయిల్ పిటిషన్‌లో ఉదహరించారు.

బెయిల్ పిటిషన్‌పై విచారణ
రియా చక్రవర్తి తరుఫున న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు గురువారం (సెప్టెంబర్ 10న) విచారించనున్నది. దాంతో రియాకు బెయిల్ పిటిషన్‌కు కోర్టు సానుకూలంగా స్పందిస్తుందా? లేక రిజెక్ట్ చేస్తుందా? అనే విషయం ఆసక్తిగా మారింది. అంతేకాకుండా విచారణ తీరును తప్పు పట్టడంతో ఎన్సీబీ అధికారులు ఎలా స్పందిస్తారనే చర్చనీయాంశమవుతున్నది.


Click it and Unblock the Notifications











