twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహారాష్ట్ర పోలీసులకు సుప్రీం మొట్టికాయ... బీహార్ పోలీసాఫీసర్‌ను క్వారంటైన్‌లో పెట్టడంపై ఆగ్రహం

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ప్రస్తుతం బీహార్ కేంద్రంగా మారింది. జూన్ 14న సుశాంత్ మరణించినా.. ఇప్పటి వరకు కేసులో కదలిక లేకపోవడంతో అతని తండ్రి కేకే సింగ్ రియా చక్రవర్తిపై పాట్నాలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక కేకే సింగ్ ఫిర్యాదులో కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి అన్ని కళ్లు రియావైపు చూడటం ప్రారంభించాయి. అయితే రియా మాత్రం తప్పించుకుని తిరగడం అనుమానాలకు దారి తీస్తోంది.

    Recommended Video

    Sushant Singh Rajput : సుశాంత్ సూసైడ్ కేసు..మహారాష్ట్ర పోలీసులకు సుప్రీం మొట్టికాయ!
    బెయిల్ కోసం ప్రయత్నం..

    బెయిల్ కోసం ప్రయత్నం..

    తన కొడుకును మోసం చేసిందని, డిప్రెషన్ లోనయ్యేలా చేసి చివరకు మరణించేలా చేసిందని, డబ్బులు కాజేసిందని ఇలా పలు రకాలు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు రియాను విచారించడానికి, అరెస్ట్ చేయడానికి బీహార్ పోలీసులు రంగం సిద్దం చేశారు. కానీ వీరి నుంచి తప్పించుకునేందుకు రియా నానాపాట్లు పడుతోంది.

    ముందస్తు బెయిల్ తిరస్కరణ..

    ముందస్తు బెయిల్ తిరస్కరణ..

    బీహార్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రియా ఖరీదైన లాయర్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేయగా.. నేడు ధర్మాసనం విచారించింది. రియాకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది.

    ముంబై పోలీసుల తీరు..

    ముంబై పోలీసుల తీరు..

    బీహార్ పోలీస్ ఆఫీసర్ వినయ్ తివారి విచారణ నిమిత్తం ముంబైకి వెళ్లారు. సుశాంత్ కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వమని అడిగేందుకు వెళ్లిన తివారిని అక్కడి క్వారంటైన్ సెంటర్‌లోనే ఉంచారు. ఇలా ఓ అధికారిని ఉద్దేశ్యపూర్వకంగా చేయడంపై సుప్రీం కోర్టు స్పందించింది.

    అది మంచి పద్దతి కాదు..

    అది మంచి పద్దతి కాదు..

    బీహార్ పోలీస్ ఆఫీసర్ వినయ్ తివారిని క్వారంటైన్‌లో ఉంచడమనేది మంచి చర్య కాదని సుప్రీం కోర్టు తెలిపింది. బయటకు ఇది వేరే సంకేతాన్ని మోసుకెళ్తుందని, ఓ పద్దతి ప్రకారం చేయాలని, అన్ని సాక్ష్యాలను భద్రపర్చాలని, నిజ నిజాలను బయటకు తీసుకురావాలని ముంబై పోలీసులకు సూచించింది.

    English summary
    SC Fires On Mumbai Police About Vinay Tiwari In Quarantine. It doesn't give a right message. You must do everything in a professional manner and protect all evidence
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X