For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బయటపడ్డ నిజం: ఆ హీరో రేప్ కేసు ఆధారంగానే సినిమా తీశారట!

|

అక్షయ్ ఖన్నా, రీచా చద్దా, రాహుల్ భట్, మీరా చోప్రా ప్రధాన పాత్రల్లో అజయ్ బహ్ల్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'సెక్షన్ 375' గతవారం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ నటుడు షైనీ అహుజా రేప్ కేసు ఆధారంగా సెక్షన్ 375 కథ రాశారట. చిత్ర రచయిత మనీష్ గుప్తా ఈ విషయం స్పష్టం చేశారు.

"షైనీ వ్యక్తిగతంగా నాకు తెలుసు కాబట్టి షైనీ అహుజా కేసు నుండి ప్రేరణ పొంది ఈ కథ రాశాను. ఇది 2009లో జరిగింది. 2009లో నేను షైనీతో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇది గ్యాంగ్ స్టర్ చార్లెస్ శోబ్రాజ్ పై చేయాలనుకున్న సినిమా, ఇందుకోసం ఓషీవారాలోని ఆయన నివాసానికి వెళ్లి షైనీని, అతని భార్య అనుపమ్‌ను కలిసేవాడిని "అని మనీష్ గుప్తా ది క్వింట్‌తో అన్నారు.

ఆ విషయం విని షాకయ్యాను

ఆ విషయం విని షాకయ్యాను

"నేను వారి ఇంటికి వెళ్లినపుడు యంగ్ ఏజ్ గర్ల్ పనిమిషిగా ఉండేది. ఒక సాయంత్రం, షైనీని ఆ అమ్మాయిని అత్యాచారం చేసినందుకు అరెస్టు అయినట్లు వార్త విని షాక్ అయ్యాను. వెంటనే ఓషివారా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాను" అని మనీష్ గుప్తా తెలిపారు.

ఏ విషయం వారు క్లారిటీగా చెప్పలేక పోయారు

ఏ విషయం వారు క్లారిటీగా చెప్పలేక పోయారు

పోలీస్ స్టేషన్లో ఈ విషయమై డీసీపీని కలిశాను. షైనీ, పనిమనిషి మధ్య ఆ సంఘటన జరిగిన మాట నిజమే అని వారు తెలిపారు, కానీ అది అత్యాచారమా? లేక పరస్పర అంగీకారంతో జరిగిందా? అనే విషయం వారు క్లారిటీగా చెప్పలేక పోయారు... అని గుప్తా చెప్పుకొచ్చారు.

షైనీ భార్యను కలిసిన తర్వాత అనుమానాలు ఎక్కువయ్యాయి

షైనీ భార్యను కలిసిన తర్వాత అనుమానాలు ఎక్కువయ్యాయి

‘మరో సందర్భంలో షైనీ భార్యను కలవడానికి వెళ్ళినప్పుడు... పోలీసు దర్యాప్తులో కూడా చాలా సందేహాలు ఉన్నాయని, DNA నివేదికలను ఎలా మార్చవచ్చో కూడా ఆమె వివరించింది' అని ఓ పత్రికతో మాట్లాడుతూ మనీష్ గుప్తా చెప్పుకొచ్చారు.

అతడి కెరీర్, జీవితం నాశనం అయింది

అతడి కెరీర్, జీవితం నాశనం అయింది

"ఈ కేసు వల్ల అతని కెరీర్ పాడైంది, అతను నాలుగైదు నెలల జైలు జీవితం గడిపాడు, బయటకు వచ్చిన తరువాత కూడా అతడిపై ఆ కళంకం ఉంది. మీరు అత్యాచారం వంటి నేరానికి పాల్పడితే మీతో ఎవరూ మాట్లాడటానికి, కలవడానికి ఇష్టపడరు. కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటారు. ఈ కేసు వల్ల అతని జీవితం, కెరీర్ నాశనమైంది "అని మనీష్ గుప్తా తెలిపారు.

ఏది నమ్మాలో తెలియలేదు

ఏది నమ్మాలో తెలియలేదు

" ఒక వైపు అనుపమ్ ఒక మహిళ, ఆమె భర్తపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. పరస్పర అంగీకారంతో ఆ సంఘటన జరిగినప్పటికీ ఆమె జీవితం సర్వనాశనం అయ్యింది. మరోవైపు, ఈ అమ్మాయిపై అత్యాచారం జరిగింది. ఈ సంఘటన నాకు చాలా బాధ కలిగించింది. ఇలా ఇతర అంశాలు కలిపి ఈ కథ రాశాను' అని మనీష్ గుప్తా తెలిపారు.

English summary
Writer of Section 375, Manish Gupta revealed that the movie based on the rape case of actor Shiney Ahuja. "It is absolutely inspired by the Shiney Ahuja case because I knew Shiney personally. This was in 2009. In 2009, I was supposed to do a film with Shiney. It was supposed to be a film on the gangster Charles Sobhraj. So I used to visit Shiney at his residence in Oshiwara and his wife Anupam," Gupta told The Quint.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more