చావు బ్రతుకుల్లో సీనియర్ హీరో.. ఒకప్పుడు కోట్ల సంపాదన.. ఇప్పుడు మాత్రం డబ్బుల్లేక..
2020 సినిమా ఇండస్ట్రీను ఏ స్థాయిలో దెబ్బ కొట్టిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రంగుల ప్రపంచంలో ఒక్కసారిగా కరోనా చీకటి కమ్మడంతో చాలా మంది సినీ తారలు ప్రాణాలు విడిచాడు. ఇక మరికొందరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అయితే సినిమా కెరీర్ దెబ్బ తినడంతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న ఒక నటుడు కూడా ఇప్పుడు ప్రాణాలతో పోరాటం చేస్తున్నాడు.

అప్పట్లో స్టార్ హీరోగా..
ఆ నటుడు మరెవరో కాదు.. 90ల కాలంలో మెహందీ', ‘ఫరేబ్' వంటి బాక్సాఫీస్ హిట్స్ తో అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన బాలీవుడ్ నటుడు ఫరాజ్ ఖాన్. సినిమా రంగంలో మొదట్లో కొంత వరకు బాగానే కష్టపడిన ఈ నటుడు సీనియర్ నటుటు యూసుఫ్ ఖాన్ తనయుడు. అప్పట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఈ సీనియర్ నటుడు కొన్నేళ్ల తరువాత ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఒకప్పుడు కోట్ల సంపాదన..
ఇక ప్రస్తుతం ఫరాజ్ ఖాన్ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో చావుబతుకుల్లో ఉన్నారు. బెంగళూరు కన్నింగ్‌హాం రోడ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఒకప్పుడు కోట్ల సంపాదనతో ఉన్నవారే. అయితే ఇప్పుడు ఆర్థిక కారణాల వల్ల మెరైగైన వైద్యం అందుకోలేక సతమతమవుతున్నారు. గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఫరాజ్ ఇప్పుడు 25లక్షలు సమకూర్చుకోలేకపోతున్నాడని తెలుస్తోంది.

వారం రోజులుగా ఐసీయూలోనే ట్రీట్‌మెంట్
ఇక ఫరాజ్ ఖాన్ కుటుంబ సభ్యులు ఈ సీనియర్ నటుడిని ఆదుకోవాలని కోరుతున్నారు. గత కొంత కాలంగా తీవ్రమైన దగ్గు జ్వరం ఉండడంతో మొదట సాదారణ ట్రీట్మెంట్ అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఫరాజ్‌ఖాన్‌కు వైద్యం చేయించేందుకు ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. గత వారం రోజులుగా ఐసీయూలోనే ట్రీట్‌మెంట్ అందిస్తుండంతో ఫ్యామిలీ వద్ద ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది.

ఫండ్ రైజింగ్ ప్లాట్‌ఫామ్
ఇంకా ఫరాజ్‌ఖాన్ ను కాపాడుకోవాలి అంటే 25లక్షల వరకు డబ్బు అవసరం అవుతుందని అందుకు దాతలు ఎవరైనా ఆదుకోవాలని కుటుంబ సభ్యులు మీడియా ద్వారా వారి బాధను వివరించారు. ఇక ఇప్పటికే ఫరాజ్ సోదరుడు ఫామన్ ఖాన్ అన్న వైద్యం కోసం ఆయన ఫండ్ రైజింగ్ ప్లాట్‌ఫామ్ ఎంచుకున్నాడు.
Recommended Video

స్పందించిన పూజా భట్
ఇక ఫరాజ్ ఖాన్ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకొని కొంతమంది సినీ తారలు స్పందించారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పూజా భట్ ఫరాజ్ చికిత్స కోసం తనవంతు ఆర్థిక సాయం అందించారు. అలాగే తోటి సినీనటులు, ప్రేక్షక దేవుళ్ళు కూడా ఆ సీనియర్ నటుడికి తోడుగా నిలవాలని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక అభిమానులు కూడా నటుడి కుటుంబానికి అండగా నిలిచే ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











