Kajol: నా జీవితంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నా.. అందుకే ఇలా.. కాజోల్ షాకింగ్ పోస్ట్

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. దశాబ్దకాలం పాటు బాలీవుడ్ లో తనదైన శైలిలో స్టార్ హీరోలకి జోడీగా మూవీస్ చేసింది. అజయ్ దేవగన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు టీనేజ్ కూతురు కూడా ఉంది.

ఆమెని హీరోయిన్ గా పరిచయం చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా ఆమెని మీడియాకి కూడా పరిచయం చేసింది. అయితే అంతా హ్యాపీగా కొనసాగుతున్న సమయంలో అమ్మడు సోషల్ మీడియాలో ఒక షాకింగ్ పోస్ట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

senior actress Kajol Takes A Break From Social Media, Writes, emotional note

ఇప్పటికి బిజీబిజీగా: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మర్చిపోలేని చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది కాజోల్. ఇక ఇప్పుడు ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తోంది. గత ఏడాది సలామ్ వెంకీ అనే మూవీతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2లో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. ఈ ఆంథాలజీ మూవీ ఈ నెల ఆఖరులో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

senior actress Kajol Takes A Break From Social Media, Writes, emotional note

సోషల్ మీడియాలో కూడా: తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం మూవీ కోసం ఆమెని ఎంపిక చేసారనే ప్రచారం వినిపిస్తోంది. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇక బాలీవుడ్ హీరోయిన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో ప్లాట్ ఫార్మ్ లలో చాలా యాక్టివ్ గా ఉంటారు.

కాజోల్ కూడా అదే తరహాలో ఉంటుంది. వారికి సంబందించిన అన్ని అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ఇన్ స్టా, ట్విట్టర్ లో పంచుకుంటారు. అయితే అయితే సెలబ్రిటీలకి సోషల్ మీడియాలో ఎంత పాజిటివ్ సపోర్ట్ ఉంటుందో అంతగా నెగిటివ్ యాంగిల్ లో ట్రోల్ చేసే వారు కూడా ఉంటారు.

senior actress Kajol Takes A Break From Social Media, Writes, emotional note

నెగిటివిటీ తట్టుకోలేక: ఒక్కోసారి ఈ ట్రోల్ చేసే వ్యక్తులు శృతి మించి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై కూడా తీవ్ర దూషణలు చేస్తూ ఉంటారు. ఇవి వారిని మానసికంగా దెబ్బ తీస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కొంత మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో నెగిటివిటీ తట్టుకోలేక వాటికి దూరం అవుతారు.

ఇప్పుడు అదే దారిలో వెటరన్ స్టార్ కాజోల్ కూడా చేరిపోయారు. ఆమె తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ డీయాక్టివేట్ చేశారు. తన అభిమానులు అందరికి సారీ చెప్పి ఇన్ స్టాగ్రామ్ నుంచి వైదొలిగారు.

senior actress Kajol Takes A Break From Social Media, Writes, emotional note

అత్యంత కఠిన పరిస్థితులు అంటూ: అయితే ట్విట్టర్ లో మాత్రమే ఆమె పాత ఫోటోలు, వీడియోలు అన్ని అలాగే ఉన్నాయి. దీనిని మాత్రం కొనసాగిస్తున్నారు. అయితే ఇన్ స్టాగ్రామ్ నుంచి ఆమె వైదొలగడానికి కారణం ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే నా జీవితంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నా.. అందుకే సోషల్ మీడియా నుంచి కొంతకాలం విరామం తీసుకోవాలని అనుకుంటున్నా అని ఆమె చివరిగా పోస్ట్ పెట్టారు. దీనిపై కాజోల్ కి ఆమె అభిమానులు ధైర్యం చెబుతూ మెసేజ్ లు పెడుతూ ఉండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X