52 ఏళ్ల ఏజ్‌లో మితిమీరన శృంగారం.. ఎట్టకేలకు నోరు విప్పిన హీరోయిన్ టబు

సినిమా రంగంలో చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో పాన్ ఇండియా హీరోయిన్ టబు ఒకరు. చాలా ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా ప్రయాణం మొదలు పెట్టిన ఈ అమ్మడు.. దాదాపు మూడు దశాబ్దాలుగా సినిమాల్లో సందడి చేస్తోంది. ఈ మధ్య కాలంలో అయితే మరింత ఎక్కువగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న టబు.. సినిమాల్లో రొమాన్స్ చేయడంపై స్పందించింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో మీరే చూసేయండి!

అక్కడా ఇక్కడా ఫేమస్:హైదరాబాద్‌కు చెందిన టబు చిన్న ఏజ్‌లోనే హిందీలో బాలనటిగా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనే హీరోయిన్‌గా పరిచయం అయింది. అలా కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత 'కూలీ నెం 1' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించింది. తద్వారా ఎనలేని పాపులారిటీని దక్కించుకుంది.

Senior Actress Tabu Clarity About Romantic Movie Roles

తెలుగులోకి మళ్లీ వచ్చి:తెలుగులో అనుకున్న విధంగా సినిమాలు చేయలేకపోయిన టబు.. 'పాండురంగడు' సినిమా తర్వాత ఆమె మరోసారి టాలీవుడ్‌కు దూరమైంది. అయితే, త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో'తో ఆమె రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో డీసెంట్ రోల్‌తో ఆకట్టుకుంది. కానీ, దీని తర్వాత మళ్లీ ఆమె తెలుగులో మరో సినిమా చేయలేదు.

గ్లామర్ రోల్స్ చేస్తోంది:బాలీవుడ్‌లో వరుసగా మూవీలు చేస్తూనే వస్తోన్న టబు.. 'అంధాధున్' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తర్వాత అడల్ట్ కంటెంట్ ఉన్న 'ఏ సూటబుల్ బాయ్'లో నటించడంతో ఆమె పేరు మారుమ్రోగింది. అప్పటి నుంచి టబుకు బాలీవుడ్‌లో అవకాశాలు భారీగా వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ భామ ఎక్కువగా గ్లామరస్ రోల్స్‌ను చేసుకుంటూ సాగుతోంది.

Senior Actress Tabu Clarity About Romantic Movie Roles

ఇప్పుడా సినిమాలతో:52 ఏళ్ల వయసు దాటినా టబు మాత్రం ఎంతో స్పీడుగానే సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ మధ్య 'దృశ్యం 2'తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అలాగే, 'భూల్ భులయా'లోనూ నటించింది. ఇక, ఈ ఏడాది అప్పుడే 'కుత్తే', 'భోళా', 'ఖుఫియా', 'ది క్రూ' మూవీలతో వచ్చింది. ఇక, ఇప్పుడు 'ఔర్ మే క్యా దమ్ థా' అనే సినిమాతో రెడీ అవుతోంది.

రొమాన్స్‌పై ప్రశ్నలు:టబు నటించిన 'ఔర్ మే క్యా దమ్ థా' సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందుకోసం ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా 50 ఏళ్లు దాటినా ఈ మధ్య రొమాంటిక్ మూవీలు, అలాంటి పాత్రలనే చేస్తుండడంపై టబుకు ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటిపై తొలిసారిగా ఆమె స్పందించింది.

Senior Actress Tabu Clarity About Romantic Movie Roles

వయసుతో లేదంటూ:రొమాంటిక్ పాత్రలపై టబు స్పందిస్తూ.. 'రొమాన్స్ అనేది యూత్‌కు లేదా కొంత వయసు వారికి మాత్రమే అని ఏమీ పరిమితులు ఉండవు. లవ్, రొమాన్స్ వంటి వాటి గురించి మాట్లాడేందుకు వయసుతో పని లేదు. ఈ సినిమా ప్రేమ, శృంగారం కంటే ముఖ్యమైన అంశాలను హైలైట్ చేసి ఉంటుంది' అని చెప్పింది. తద్వారా పాత్ర డిమాండ్ చేస్తే రొమాన్స్ చేస్తానని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X