టబుతో 24 ఏళ్ల కుర్రాడి రొమాన్స్.. ఆ ఫీలింగ్ చెప్పిన యంగ్ స్టార్
సీనియర్ నటి టబు తెలుగులో చేసిన కొన్ని సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకుల్లో మాత్రం చెరగని ముద్రను వేసుకుంది. తన అందం, అభినయంతో సౌత్ ఆడియెన్స్ గుండెల్లో మంచి స్థానాన్ని దక్కించుకుంది. ఎక్కువగా టబు హిందీ భాషలోనే సినిమాలు చేసింది. హైదరాబాద్ లో పుట్టిన పెరిగినప్పటికీ బాలీవుడ్ లోనే వరుస ఆఫర్లు అందుకొని అక్కడ పాతుకుపోయింది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. నార్త్ ఆడియెన్స్ తో పాటు సౌత్ ఆడియెన్స్ ను కూడా తన అభిమానులుగా మార్చుకుంది. ఇప్పటి వరకు 90కి పైగా సినిమాల్లో నటించింది. అయితే తను నటించిన ఓ సిరీస్ వల్ల ఇప్పుడు వార్తల్లో నటించింది.
ఏ సూటెబుల్ బాయ్.. సిరీస్ తో షాక్..
నటి టబు హిందీ, తెలుగు, తమిళ భాషలో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. కానీ ఎంతో చక్కటి పాత్రలు పోషించింది. కానీ ఎప్పుడూ మితిమీరిన రొమాన్స్ తో మాత్రం ప్రేక్షకులకు దర్శనం ఇవ్వలేదు. తన నటనతో కుర్ర హృదయాలను గెలుచుకునే వరకే అందాన్ని ప్రదర్శించేంది కానీ, హద్దులు దాటేసి మరీ నటించలేదు. కానీ 2020లో ఇంగ్లీష్ భాషలో వచ్చి న 'ఏ సూటెబుల్ బాయ్' సిరీస్ లో మాత్రం తనకంటే 24 ఏళ్ల చిన్నవాడైన బాలీవుడ్ యంగ్ యాక్టర్ ఇషాన్ కట్టర్ తో రొమాన్స్ సీన్లలో నటించింది. మితిమీరిన సీన్లతో హద్దులు చెరిపేసి అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

టబుపై దారుణమైన కామెంట్..
సీనియర్ నటి టబుతో ఆ సిరీస్ లో క్లోజ్ సన్నివేశాల్లో నటించిన ఇషాన్ కట్టర్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. టబుతో అలాంటి సీన్లలో నటించే సమయంలో కాస్తా కంగారు పడ్డానని, కానీ తనే ధైర్యం చెప్పి సులువుగా నటించేలా చేశారని అన్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.. అంతే కాకుండా టబును 'నాటీ' అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది. సెట్ లో ఆమె చిన్న పిల్లల మాదిరిగానే ప్రవర్తిస్తుందని కూడా టబు గురించి చెప్పారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో ఆశ్చర్యకరంగా..
ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లు తమ కెరీయర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సందర్భంగా కాస్తా రూట్ మార్చి హద్దులు మించిన సీన్లలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక టబు కూడా తన కెరీయర్ లో అలాంటి పాత్రలపై ఆసక్తిగా ఉందని 2020లో వచ్చిన 'ఏ సూటెబుల్ బాయ్' సిరీస్ తో తేటతెల్లమైంది. ఇక చివరిగా హౌజ్ ఫుల్ 5, డూనే సిరీస్ లో నటించింది. నెక్ట్స్ భూత్ బంగ్లా చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.
తెలుగులో టబు గుర్తుండిపోయే సినిమాలు..
టాలీవుడ్ లో టబు మొట్టమొదటి సారిగా 'కూలీ నెం.1' చిత్రంలో నటించింది. వెంకటేశ్ సరసన మెప్పించింది. ఆ తర్వాత సిసింద్రీ, నాగార్జున సరసన 'నిన్నే పెళ్లాడుతా', ఆవిడా మా ఆవిడే', 'చెన్నకేశవ రెడ్డి', అందరివాడు వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. చివరిగా అల్లు అర్జున్ 'అలా వైకుంఠపురం' చిత్రంలో తల్లి పాత్రలో నటించి మెప్పించింది.


Click it and Unblock the Notifications











