ఖాళీ అపార్టుమెంటుకు తీసుకెళ్లి నటితో సెక్సువల్ మిస్‌కండక్ట్... డైరెక్టర్‌పై కేసు!
#మీటూ ఉద్యమం బలపడిన తర్వాత పలువురు నటీమణులు, నటులు తమకు ఎదురైన సెక్సువల్ హరాస్మెంట్, లైంగిక దాడుల సంఘటల గురించి ధైర్యంగా బయటకు చెప్పడంతో పాటు పోలీస్ కంప్లయింట్స్ సైతం ఇవ్వడానికి వెనకాడటం లేదు.
ఇప్పటికే పలువురు ప్రముఖుల మీద ఇలాంటి ఆరోపణలు రావడంతో పాటు కొందరిపై రేప్ కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా మరో కాస్టింగ్ డైరెక్టర్ సెక్సువల్ మిస్‌కండక్ట్ కేసులో బుక్ అయ్యాడు. ముంబై పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

కాస్టింగ్ డైరెక్టర్ విక్కీ సిదానా
బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ విక్కీ సిదానా మీద ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అతడు ఓ నటితో సెక్సువల్ మిస్‌కండక్ట్(దుష్ప్రవర్తన)కు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఐపిసి సెక్షన్ 354, 509, 406 కింద కేసు నమోదు చేశారు.
మీటూ ఉద్యమంలో నటి కార్తీక శర్మ
మీటూ ఉద్యమంలో భాగంగా నటి కార్తీక శర్మ కాస్టింగ్ డైరెక్టర్ విక్కీ భాగోతం బయట పెట్టింది. ఆరేళ్ల క్రితమే ఆమె ఓ ఇంటర్వ్యూలో అతడు లైంగికంగా వేధిసంచినట్లు ఆరోపించారు. అయితే వాటిని ఆయన ఖండించారు.

అతడి ఉంట్లోనే ఉన్నాను
విక్కీని తొలిసారి ఢిల్లీలో కలిశానని, ఓ పాత్ర కోసం ఆయనతో ఆరేళ్ల క్రితం మీట్ అయ్యానని తెలిపారు. తర్వాత తాను పని కోసం ముంబై వచ్చానని, అపుడు ఆర్థిక ఇబ్బంది వల్ల విక్కీ ఇంట్లో స్టే చేసినట్లు తెలిపారు. అక్కడ అతడి భార్య కూడా ఉంటుంది కాబట్టి సేఫ్ అని భావించినట్లు తెలిపారు.

తర్వాత మరో ఖాళీ ఆపార్టుమెంటుకు తీసుకెళ్లాడు
తర్వాతి రోజు అతడు నన్ను ఓ ఖాళీ అపార్టుమెంటుకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు కార్తీక ఆరోపించారు.


Click it and Unblock the Notifications











