»   » డైరెక్టర్ దుర్మార్గాల్ని బయటపెట్టిన సలోని.. మర్మాంగం పట్టుకో.. హస్తప్రయోగం..

డైరెక్టర్ దుర్మార్గాల్ని బయటపెట్టిన సలోని.. మర్మాంగం పట్టుకో.. హస్తప్రయోగం..

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  #MeToo : Actress Saloni Tweets On Sajid Khan

  బాలీవుడ్‌లో మరో లైంగిక దుర్మార్గం బయటపడింది. నానా పాటేకర్, సుభాష్ ఘాయ్, అలోక్ నాథ్ తర్వాత ఈ సారి డైరెక్టర్ సాజిద్ ఖాన్ వంతైంది. సాజిద్ ఖాన్ దారుణమైన అకృత్యాలను హీరోయిన్ సలోని చోప్రా బయటపెట్టింది. సలోని చెప్పిన విషయాలు రాయడానికి వీలు లేకుండా ఉండటం చూసి బాలీవుడ్‌లో ఇంత దారుణమైన విషయాలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. సలోని చెప్పిన ప్రకారం..

  సాజిద్ ఖాన్‌కు అసిస్టెంట్‌గా

  సాజిద్ ఖాన్‌కు అసిస్టెంట్‌గా

  2011లో సాజిద్‌కు నేను అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ సమయం నా జీవితంలో అత్యంత దారుణమైన సంఘటనలు చోటుచేసుకొన్నాయి. నాతో ఓ సందర్భంలో హస్త ప్రయోగం చేసుకుంటావా? చేసుకొంటే వారానికి ఎన్నిసార్లు చేసుకొంటావు అని ప్రశ్నించారు.

  లైంగికంగా హింసించి

  లైంగికంగా హింసించి

  తన వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసే సమయంలో నన్ను లైంగికంగా, మానసికంగా దారుణంగా వంచించారు. అర్ధరాత్రి సమయాల్లో పిలుపించుకొనే వారు. కానీ పని ఉండేది కాదు. నా బికినీలో ఫొటోలు దిగమని చెప్పేవాడు. యాక్టర్ కావాలనుకొంటున్నావు కదా.. నీవు ఎలా ఉంటావో చూడాలనుకొంటున్నాను అని వెకిలి నవ్వులు నవ్వేవాడు అని సలోని తెలిపింది.

  సెక్సీగా ఉండవని

  సెక్సీగా ఉండవని

  నీవు సెక్సీగా ఉండవు. యాక్టర్ ఎలా అవుదామని అనుకొంటున్నావు అని మాటలతో వేధించేవాడు. ఎన్నోసార్లు అతిగా ప్రవర్తించిన కెరీర్ కోసం రాజీ పడ్డాను. చాలా నెలలపాటు అలా వేధించాడు అని సలోని ఆవేదన వ్యక్తం చేసింది.

  ప్రియురాలితో సెక్స్ గురించి దారుణంగా

  ప్రియురాలితో సెక్స్ గురించి దారుణంగా

  నా ముందే తన ప్రియురాలితో దారుణంగా ప్రవర్తించేవాడు. తన ప్రియురాలితో గడిపిన రాత్రుల గురించి, సెక్స్ లైఫ్ గురించి చెప్పేవాడు. తన మర్మాంగాన్ని పట్టుకోమని అడిగేవాడు. అలాంటి పనులను నాతో చేయిస్తూ నరకం చూపించాడు అని సలోని పేర్కొన్నది.

  స్కర్ట్ పైకి లేపమని

  స్కర్ట్ పైకి లేపమని

  ఓ సినిమా షూటింగ్‌లో ఓ అమ్మాయి డ్రస్ మార్చకుంటుండగా ట్రయల్ రూమ్‌లోకి వచ్చాడు. ఆ అమ్మాయిని వేధిస్తూ స్కర్టును పైకి లేపమన్నాడు. నీకు సరిగా బ్రెస్ట్, బ్యాక్ లేదు అంటూ హింసించాడు అని సాజిద్ దారుణాలను బయటపెట్టింది.

  ఇంటికి రమ్మని వేధించాడు

  ఇంటికి రమ్మని వేధించాడు

  ప్రతీ రోజు తన ఇంటికి రమ్మని వేధించేవాడు. చివరికి నీకు ఏం కావాలో చెప్పమని, నా నుంచి ఏం ఆశిస్తున్నావో వెల్లడించమని నిలదీశాను. అందుకు నాతోనే నీవు ఉండు. నీతో గడుపాలని ఉంది అని చెప్పేవాడు. చాలా సార్లు నన్ను ఇంటికి పిలిచి పలుమార్లు బెదిరించాడు. నీ అంతు చూస్తానని అన్నాడు. నాతో చేయకూడదని పనులు చేయించాడు.

  చచ్చిపోదామనుకొన్నా

  ఒకరోజు ఇంటికి పిలిచి కోరిక తీర్చమని అడిగాడు. దాంతో తాను ఆగ్రహం చెంది నీ బండారం బయటపెడుతానని బెదిరిస్తే.. నన్ను కాల్చి చంపుతాను అని హెచ్చరించాడు. ఇండస్ట్రీలో నీకు జీవితం లేకుండా చేస్తానని బెదిరించాడు. దాంతో ఓ దశలో చచ్చిపోదామనుకొన్నాను.

  సాజిద్ ఖాన్ అవుట్

  సాజిద్ ఖాన్ అవుట్

  సలోని తాజా ఆరోపణల నేపథ్యంలో సాజిద్ ఖాన్‌పై సినీలోకం భగ్గుమంటున్నది. ఈ వార్త బయటకు రాగానే హౌస్‌ఫుల్4 నుంచి చిత్ర యూనిట్ తొలగించింది. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

  English summary
  MeToo movement has rocked Bollywood, with influential names like Nana Patekar, Vikas Bahl, Alok Nath, Subhash Ghai and Rajat Kapoor under the scanner. Now, shocking allegations of sexual misconduct have been levelled against filmmaker Sajid Khan by actress Saloni Chopra. Saloni, who assisted Sajid in 2011, called it "the most awful experience of my life". The indecent behaviour started with the interview itself, with him asking her questions like, "Do you masturbate?" and "How many times a week?"
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more