twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ కేసులో అరెస్ట్‌లు తప్పనిసరి.. అప్పుడే దర్యాప్తుకు అర్ధం.. సుప్రీంలో మహా సర్కార్‌కు వాతలు

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు విషయంలో సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌‌ తప్పుదోవ పట్టించేలా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. సీబీఐ దర్యాప్తును నిలిపివేయాలని, అలాగే పాట్నా నుంచి కేసును ముంబైకి బదిలీ చేయాలని రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరగగా తుషార్ మెహతా పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఆయన తన వాదనలు వినిపిస్తూ..

    తప్పుదోవ పట్టించేలా మహారాష్ట్ర అఫిడవిట్

    తప్పుదోవ పట్టించేలా మహారాష్ట్ర అఫిడవిట్

    మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ అంతా తప్పుల తడక, తప్పదోవ పట్టించేలా ఉంది. అసహజ మరణం మాదిరి కేసును యాక్సిడెంటల్ డెత్‌గా ముంబై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. సీఆర్పీసీ 175 కింద దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అయితే 175 సీఆర్పీసీ కింద దర్యాప్తు చేయరాదు అంటూ తుషార్ మెహాతా వాదనలు వినిపించారు.

    బీహార్ నుంచి కేసు ట్రాన్స్‌ఫర్ చేయం

    బీహార్ నుంచి కేసు ట్రాన్స్‌ఫర్ చేయం

    సుశాంత్ మరణం విషయంలో ముంబై పోలీసుల దర్యాపుకు సంబంధించిన ఏ కేసు కూడా పెండింగ్ లేదు. బీహార్ నుంచి కేసును ట్రాన్స్‌ఫర్ చేసే ప్రశ్నే లేదు. ఇప్పుటి వరకు ముంబై పోలీసులు వ్యవహరించిన తీరు న్యాయవ్యవస్థకు చేటు కలిగించే విధంగానే ఉంది. ఇప్పటి వరకు 56 మందిని విచారించిన చట్టం దృష్టిలో వాటికి విలువే లేదు అని తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

    ముంబై పోలీసుల దర్యాప్తుపై అసంతృప్తి

    ముంబై పోలీసుల దర్యాప్తుపై అసంతృప్తి

    సుశాంత్ కేసులో ముంబై పోలీసులు చేస్తున్న దర్యాప్తులో చట్టపరమైన ప్రమాణాలు లేవు. 56 మందిని విచారించామని చెప్పుకొంటున్నారు గానీ అందులో చట్టాలను అనుసరించి చేసిన దర్యాప్తు కనిపించదు. ఈ కేసులో అరెస్ట్ అనివార్యం. అప్పడే ఈ కేసు దర్యాప్తు సజావుగా జరుగుతుంది. దర్యాప్తుకు శక్తి చేకూరుతుంది అంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

    Recommended Video

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
    బీహార్‌లోనే దర్యాప్తు చేస్తాం

    బీహార్‌లోనే దర్యాప్తు చేస్తాం

    సుశాంత్ కేసు విచారణ ముంబైలోనే జరుగుతుంది. పాట్నాలో దాఖలైన ఎఫ్ఐఆర్ వ్యాలిడిటీపై ప్రశ్నలు ఎదురైనప్పటికీ.. ముంబైలో ఎలాంటి విచారణ, దర్యాప్తు జరగదు అని తుషార్ మెహతా స్పష్టం చేశారు. మహారాష్ట్ర సీల్డ్ కవర్‌లో సమర్పించిన దర్యాప్తు నివేదికకు ఎలాంటి చట్టబద్దత లేదు. ఆ దర్యాప్తు చట్టపరిధిలోకి రాదన్నారు.

    English summary
    Solicitor General Tushar Mehta demands arrest in sushant Case. He says Maharashtra affidavit 'misleading'. He argued that, Sushant Singh death case Investigation is only happening in Bihar. The validity of the FIR might be in question but there is no investigation in Mumbai at all.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X