కంగనా పై విమర్శలు గుప్పించిన సీనియర్ నటి
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలకు ఎక్కుతూనే ఉంది. బాలీవుడ్ లో ఉన్న కొందరిని మాఫియాగా పేర్కొంటూ ఆమె చేస్తున్న విమర్శలు అన్ని ఇన్నీ కావు. ఆ మాఫియాకు మద్దతిస్తున్న వారిని సైతం కంగనా విడిచిపెట్టడంలేదు. సుశాంత్ మరణం తరవాత కంగనా ఎక్కువగా వార్తల్లో నిలిచింది.
అయితే బాలీవుడ్ కు తానే స్త్రీవాదాన్ని, జాతీయవాదం నేర్పించా అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటి షబాన అజ్మీ స్పందించారు. కంగనా చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. అలాగే డ్రగ్ మాఫియా టెర్రరిస్టుల నుంచి బాలివుడ్ ను రక్షించాలన్న కంగనా వ్యాఖ్యలను షబానా తిప్పికొట్టారు. చిత్ర పరిశ్రమకు తన కుండే సమస్యలున్నాయని, కానీ మొత్తం పరిశ్రమను తప్పుబట్టడం అన్యాయమన్నారు.

సామాజికంగా నిబద్ధతతో మాట్లాడేవారు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారని షబనా పేర్కొన్నారు.ఇక 'రోజూ హెడ్ లైన్స్ లో లేకపోతే కంగనాకు భయం.. అందుకే ఎపుడూ వార్తల్లో ఉండేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు, దారుణమైన ప్రకటనలు చేస్తుందంటూ కంగనాపై మండిపడ్డారు.అంతే కాదు తన సొంత పురణాన్ని కంగనా విశ్వసించడం మొదలుపెట్టింది. తన మాయలో తాను బతుకుతోంది" అంటూ విమర్శించారు. కంగనా చాలా బాగా నటిస్తుంది...నటనపై దృష్టి కేంద్రీకరిస్తే మంచిదంటూ షబనా ఆజ్మీ సలహా ఇచ్చారు.


Click it and Unblock the Notifications











