నా కొడుకు గర్భవతిని చేయలేదు.. రూమర్లకు తల్లి తెర

Farhan Akhtar Shibani Dandekar: సినిమా ఇండస్ట్రీలో నిజాలు కంటే పుకార్లే త్వరగా వైరల్ గా మారుతాయి. ఎలాంటి ఆధారాలు లేకున్నా కొందరు తమకు నచ్చినట్టు, తోచినట్లు రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అందులో ఎక్కువగా సెలబ్రిటీల పెళ్లి, విడాకులు, డైవర్స్, ప్రెగ్నెన్సీ వంటి తదితర విషయాలపై రూమర్స్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంటాయి. అలా తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ హీరో త్వరలో తండ్రి కాబోతున్నాడని బి టౌన్ పుకార్లు షికారులు చేశాయి. కానీ ఆ హీరో తల్లి ఆ వార్తలపై ఓ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆమె ఏం కామెంట్స్ చేసిందంటే?

ఆ స్టార్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్‌ ఫర్హానా అక్తర్.. దిల్ చాహ్‌తా హై సూప‌ర్ హిట్ సినిమాని డైరెక్ట్ చేసిన ఫ‌రాన్‌.. ఆ త‌ర్వాత యాక్ట‌ర్‌గా మారి 'భాగ్ మిల్ఖా భాగ్' మూవీలో మిల్ఖా సింగ్‌గా న‌టించి అంద‌రి అభిమానాన్నీ పొందాడు. ఆ త‌ర్వాత 'జింద‌గీ నా మిలేగీ దొబారా', 'తూఫాన్' సినిమాల్లో హీరోగా న‌టించాడు. ఇలా వరుస విషయాలతో బాలీవుడ్ లో సక్సెస్ పుల్ గా కొనసాగుతున్నారు.

Shabana Azmi denies rumours of Farhan Akhtar and Shibani Dandekar expecting their first child

ఇదిలా ఉంటే.. హీరో పర్హానా అక్తర్, న‌టి, గాయ‌ని శిబానీ దండేక‌ర్ గత మూడేండ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ పెళ్లి.. తొలిసారి దీపికా ప‌డుకోనే, ర‌ణ‌వీర్ సింగ్ పెళ్లి రిసెప్ష‌న్‌లో ఫ‌రాన్‌, శిబానీ జంట‌గా కెమెరాల‌కు పోజిచ్చారు. అప్ప‌ట్నుంచీ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తాయి. ఆ తరువాత 2021లో త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఫ‌రాన్ పేరును త‌న మెడ‌మీద టాట్టూ వేయించుకుంది శిబానీ. అయితే.. హీరో ఫరానాకు అంతకు ముందే పెళ్లి అయింది.

2000లో పూణేకు చెందిన హెయిర్ స్టైలిస్ట్ అధునా భ‌బానీను వివాహం చేసుకున్నాడు ఫరానా . కానీ, వీరి మధ్య విభేదాలు రావడంతో 2017లో విడిపోయారు. అధున‌తో ఫ‌రాన్‌కు శ‌క్య‌, అకిర అనే ఇద్ద‌రు కుమార్తెలున్నారు. ఈ విషయం తెలిసిన శిబానీ.. ఫ‌ర్హాన్ అక్తర్ తో ప్రేమాయణం కొనసాగించడం. బాలీవుడ్లో ఎన్నో రూమార్స్ తరువాత 2022లో శిబానీ, ఫ‌ర్హాన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్తై కూడా మూడేండ్లు పూర్తి అవుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఫర్హానా అక్తర్ త్వరలో మూడో సారి తండ్రి కాబోతున్నాడని, ఫర్హాన్,శిభాని జంట తల్లిదండ్రులకు కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ గా మారాయి. ఈ పుకార్లపై ఫర్హాన్,శిభాని జంట స్పందించకపోవడంతో ఆ వార్తలు నిజమేనని నమ్మారు అభిమానులు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో ఫర్హానా అత్తర్ తల్లి షబానా అజ్మీ మౌనం వీడింది. ఆ వార్తలు పై స్పందిస్తూ.. ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని, అవన్ని పేర్కొంది. పైగా ఫర్హాన్ అక్తర్, శిబాని దండేకర్ జంట తల్లిదండ్రులు కావడానికి సిద్ధంగా లేరని మరో షాకింగ్ కామెంట్ చేసింది. హీరో అక్తర్ తల్లి చేసిన కామెంట్స్ తో ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. వారు పిల్లలు కనడానికి సిద్దంగా లేరని కామెంట్స్ చేయడంతో ఈ జంట విడిపోబోతున్నారా అనే రూమర్స్ కూడా వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X