రోడ్డు ప్రమాదంలో గాయపడిన నటి షబానా ఆజ్మీ.. పరిస్థితి విషమంగా..
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి షబానా ఆజ్మీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం మహారాష్ట్రంలోని రాయ్‌గడ్ జిల్లాలో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వేలో ఈ ఘటన చోటు చేసుకొన్నది. ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే..

ముంబైకి సమీపంలో
పోలీసు అధికారి అనిల్ పరాస్కర్ వెల్లడించిన ప్రకారం.. షబానా ఆజ్మీ ప్రయాణిస్తున్న వాహనం ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలో మధ్నాహ్నం 3.30 గంటలకు ప్రమాదానికి లోనైంది. ఆమె ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీకొట్టింది. వెంటేనే చికిత్స కోసం నవీ ముంబైలోని ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించాం. ప్రస్తుతం చికిత్స జరుగుతున్నది అని తెలిపారు.

ప్రమాదం సమయంలో జావెద్ అఖ్తర్
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగినప్పుడు షబానా ఆజ్మీతోపాటు భర్త జావెద్ అఖ్తర్ కూడా ఆమె వెంట ఉన్నారు. అయితే ఆయనకు స్వల్ప గాయాలు అయినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో వారి వెంట ఉన్న మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.
ప్రమాద ఘటనపై దర్యాప్తు
షబానా ఆజ్మీ ప్రమాద ఘటన వివరాలను హైవే పోలీస్ పెట్రోల్ టీమ్ మీడియాకు సమాచారం అందించింది. ఈ ప్రమాద ఘటనపై వివరాలు సేకరించడానికి దర్యాప్తు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపామని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం జావెద్ అఖ్తర్ క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనలో షబానా, ఆమె డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు అని రాయ్‌గఢ్ పోలీసులు తెలిపారు.

ప్రమాద వార్తపై బాలీవుడ్ షాక్
ఇదిలా ఉండగా, షబానా ఆజ్మీ ఇటీవలే తన 75వ జన్మదినాన్ని భర్త జావెద్ అఖ్తర్‌తో జరుపుకొన్నారు. ఇటీవల జావెద్ అఖ్తర్ గౌరవార్థం గురువారం ఏర్పాటు చేసిన ఓ వేడుకలో అతడితో కలిసి ఆమె ఇటీవల కనిపించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతలోనే షబానా ఆజ్మీ ప్రమాదానికి గురి కావడంపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











