twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ఖాన్ బర్త్ డే పార్టీకి అమీర్ షారుక్ డుమ్మా.. కారణాలు అవేనంట!

    |

    బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సల్మాన్ ఖాన్ ఇటీవల 53వ పడిలోకి ప్రవేశించారు. ఆయన జన్మదిన వేడుకలను పన్వేల్‌లోని విలాసవంతమైన పార్టీని నిర్వహించారు. ఆ పార్టీకి కత్రినా కైఫ్, అనిల్ కపూర్, జాక్వలైన్ ఫెర్నాండెజ్, సోనాక్షి సిన్హా, కీర్తి సనన్, సంజయ్ లీలా భన్సాలీ తదితరులు హాజరయ్యారు. అయితే తనకు సన్నిహితులైన షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ హాజరుకాకపోవడంపై బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అమీర్, షారుక్ ఎందుకు రాలేదంటే..

    బిజీ బిజీగా షారుక్, అమీర్‌ఖాన్

    బిజీ బిజీగా షారుక్, అమీర్‌ఖాన్

    ఇటీవల జీరో సినిమా ప్రమోషన్‌లో షారుక్ ఖాన్ బిజీగా ఉన్నారు. దాంతో షారుక్ ఖాన్ ఇంటిలోనే అమీర్ ఖాన్‌తో సల్మాన్ ఖాన్ బర్త్ డేకు ముందుగానే పార్టీ జరుపుకొన్నారట. అలాగే అమీర్ ఖాన్ కూడా తన సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉండటం వల్ల పార్టీకి హాజరుకాలేదట. ప్రస్తుతం చైనాలో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉండటం తెలిసిందే.

    జీరో ప్రమోషన్‌లో షారుక్ ఖాన్

    జీరో ప్రమోషన్‌లో షారుక్ ఖాన్

    డిసెంబర్ 27న జీరో ప్రమోషన్ కోసం షారుక్ ఖాన్ తన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో కలిసి పాట్నాకు వెళ్లారు. బోజ్‌పురి నటుడు రవికిషన్‌తో కలిసి ప్రమోషన్ చేయాల్సి ఉండేది. అయితే పన్వేల్‌లో జరిగిన పార్టీలో పాల్గొని ఉంటే షారుక్ ఖాన్ ఫ్లయిట్ అందుకోలేకపోయేవాడు అని ఓ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది.

    స్టార్ హీరోతో హాట్ బ్యూటీ.. భార్యలాగే అన్ని పనులు.. ముహూర్తం దగ్గరపడిందా!స్టార్ హీరోతో హాట్ బ్యూటీ.. భార్యలాగే అన్ని పనులు.. ముహూర్తం దగ్గరపడిందా!

    చైనాలో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ కోసం

    చైనాలో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ కోసం

    అలాగే థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ ప్రమోషన్ కోసం అమీర్ ఖాన్ చైనాకు వెళ్లడం పన్వేల్‌లో జరిగిన పార్టీకి హాజరుకాలేకపోయాడని బాలీవుడ్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్యతో కలిసి అమీర్ చైనాలో పర్యటిస్తున్నాడు.

    సల్మాన్‌ ఖాన్‌తో రిలేషన్స్

    సల్మాన్‌ ఖాన్‌తో రిలేషన్స్

    ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో అమీర్, షారుక్ ఖాన్ రిలేషన్స్ బాగున్నాయి. వారి మధ్య ఇప్పుడు ఎలాంటి ఇగోలు లేవు. పార్టీ కోసం వాళ్లు ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేదు. తరచు వారి మధ్య పార్టీల జరుగుతూనే ఉంటాయి. బాంద్రాలో ఉంటారు కాబట్టి వారు రెగ్యులర్‌గా కలుసుకొని మాట్లాడుకొంటారు అని వారి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

    English summary
    Salman Khan rang in his 53rd birthday in style, with a lavish party at his farmhouse in Panvel. While many Bollywood celebrities including Katrina Kaif, Anil Kapoor, Jacqueline Fernandez, Sonakshi Sinha, Kriti Sanon and Sanjay Leela Bhansali were a part of the celebrations, Shah Rukh Khan and Aamir Khan were conspicuous by their absence.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X