షారుక్ కరోనా వీడియో వైరల్.. నివారణ చర్యలు ఇలా కూడా చెప్పొచ్చా?
కరోనావైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు తమకు తోచిన విధంగా ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. భాషకు సంబంధం లేకుండా దేశ ప్రజల్లో సానుకూల స్పందనను వ్యక్తం చేయడానికి రకరకాలుగా సందేశాలు పంపుతున్నారు. తాజాగా షారుక్ ఖాన్ చేసిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నది. ఆయన తన సినిమాల్లోని క్లిప్పింగులను వీడియో చేసి.. కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు.
దగ్గు, జ్వరం వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని ఓ పాట రూపంలో.. అలాగే ఆయాసం ఇతర లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలంటూ తన సినిమాల్లోని సన్నివేశాలను, అలాగే కరోనా రోగ లక్షణాలు ఉంటే ఒంటరిగా ఉండాలి. అలాగే ఎలాంటి మాస్కులు ధరించాలి అనే విషయాలను తన సినిమాల్లోని పాటలు, సన్నివేశాలను చూపిస్తూ.. ఏది చేయాలో.. ఏది చేయకూడదో వివరిస్తూ ఆకట్టుకొన్నాడు.
తాను నటించిన యఎస్ బాస్, చల్తే చల్తే, దిల్ సే, కల్ హో నా హో, మై నేమ్ ఈజ్ ఖాన్, బాజీఘర్ తదితర చిత్రాల్లో నుంచి సీన్లు, పాటలను పేర్చి ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

భగవంతుడా..జనత కర్ఫ్యూ వల్ల కరోనావైరస్ వ్యాప్తి చేయకుండా నివారించవచ్చు. కరోనా ఎదురించడానికి మనం స్వచ్ఛంధంగా కర్ఫ్యూ పాటించాలి. దేశం కోసం సేవ చేస్తున్నవారికి చప్పట్లతో సంఘీభావం ప్రకటించాలి. అలాగే కరోనావైరస్ సోకుకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిని సరైన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని షారుక్ సూచించాడు.


Click it and Unblock the Notifications











