ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ రోల్ పై క్లారిటీ ఇచ్చిన షారుక్ ఖాన్.. మామూలుగా ఉండదట
బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీనియర్ మోస్ట్ హీరోల్లో ఒకరైన షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ లేక కాస్త మిగతావారికంటే వెనుకబడిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ లేక పోయినప్పటికీ బాద్షా క్రేజ్ విషయంలో మాత్రం నిత్యం అగ్ర హీరోలతో పోటీ పడుతూనే ఉంటాడు అని చెప్పవచ్చు. అతని భవిష్యత్తు సినిమాలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే క్రియేట్ చేస్తోంది.
ఇక ప్రస్తుతం షారుక్ ఖాన్ మూడు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో జీరో సినిమాతో ప్రేక్షకులను పలకరించిన షారుఖ్ ఖాన్ మళ్ళీ ఆ తర్వాత ఎలాంటి సినిమాను విడుదల చేయలేదు. అసలు సినిమాలు చేస్తాడా చేయడా అనే అనుమానాలు కూడా చాలానే వచ్చాయి. కానీ ఆయన అభిమానించే ప్రేక్షకుల కోసం మాత్రం కొంచెం కూడా వెనక్కి తగ్గలేదు. ఇక త్వరలోనే పటాన్ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవల క్లారిటీ అయితే ఇచ్చాడు.

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పఠాన్ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయబోతూ ఉండడం విశేషం. అలాగే అట్లీ దర్శకత్వంలో కూడా షారుక్ ఖాన్ ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నాడు. ఇక వీటితో పాటు సల్మాన్ ఖాన్ సినిమాలో కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో షారుక్ ఖాన్ సరికొత్త కిక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా లో షారుక్ ఖాన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు అని గత ఏడాది నుంచి అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఎవరు కూడా ఆ విషయమై అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇటీవల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30 ఏళ్లు అయిన సందర్భంగా షారుఖాన్ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో ముచ్చటిస్తూ.. సల్మాన్ ఖాన్ రాబోయే సినిమాలో కూడా నటించినట్లు తెలియజేశారు. టైగర్ 3 సినిమాలో తన పాత్ర సాధారణంగా ఉండదు అని తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











