షారుఖ్ ఇంట్లో ఓ రోజు గడిపే ఛాన్స్.. అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన కింగ్ ఖాన్
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. షారుఖ్ కంటే ఎక్కువగా గౌరీ ఖాన్ హల్చల్ చేస్తూ ఉంటుంది. ఇంటిరీయర్ డిజైనర్, ఆర్కిటెక్చర్, డిజైనర్‌గా పలు రంగాల్లో గౌరీ ఖాన్ తన విశిష్టతను చాటుకుంది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపునుతెచ్చుకుంది. గౌరీ ఖాన్ చేసే సినిమాల్లో అయినా ఆమె చేసే యాడ్స్‌లోనైనా ఆమె చేసే ఓ పోస్ట్‌లోనైనా సరే గౌరీ ఖాన్ ముద్రకనిపించేలానే చేస్తుంది.

ప్రకటనల్లోనూ..
షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ కలిసి నటించే ప్రకటనలు ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటాయి. అవి కూడా ఇంటీరియర్ డిజైన్, ఆర్కిటెక్చర్ పనులకు ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనల్లోనే నటిస్తారు. అందులో దాదాపు గౌరీ ఖాన్ సొంతంగా డిజైన్ చేసినవే ఉంటాయి. తాజాగా ఢిల్లీలో ఉన్న కొత్త ఇంటిని మళ్లీ రీ డిజైన్ చేసింది గౌరీ ఖాన్.

అభిమానులకు ఆఫర్..
తమ అభిమాన హీరోను చూడటమే అదృష్టంగా ఫీలయ్యే వారు కోట్లల్లో ఉంటారు. మరీ ముఖ్యంగా నేషనల్ స్టార్ షారుఖ్ ఖాన్ వంటి వారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి షారుఖ్ తన ఫ్యాన్స్‌కు ఓ ఆఫర్ ఇచ్చాడు. తమ ఇంట్లో ఓ రోజు గడిపేందుకు అభిమానులను స్వాగతించాడు.

కొత్తగా రీ డిజైన్..
గౌరీ ఖాన్ తన సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ పోస్ట్ చేసింది. మాకు పెళ్లైన కొత్తలో ఈ ఇంట్లో గడిపాం.. ఎన్నో మెమోరీస్ ఉన్నాయి..ఇన్నేళ్లుగా మేం కూడబెట్టామో అవన్నీ ఇక్కడే ఉన్నాయి..మా ప్రేమ, మా కుటుంబం తాలుకా గుర్తులన్నీ ఉన్నాయి.. ఈ స్థలాన్ని నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఎయిర్ బీఎన్‌బీ వారితో కలిసి ఈ ప్రయోగానికి సిద్దమవుతున్నాను. ఓ జంటకు మా ఇంట్లో ఓ రోజు ఉండే అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పింది.

షారుఖ్ అలా..
ఇదే విషయాన్ని షారుఖ్ చెబుతూ.. మా జీవితంలో ఆ ఇళ్లు ఎన్నో మధురానుభూతులు నింపాయి.. ఆ సిటీకి మా గుండెల్లో ప్రత్యేకస్థానం ఉంది. డిల్లీలోని మాఇంటిని గౌరీ ఖాన్ మళ్లీ రీ డిజైన్ చేయించింది. అందులో మా ప్రేమను, మా గుర్తులను నింపింది. ఎయిర్ బిఎన్‌బీతో కలిసి మా ఇంట్లోకి గెస్ట్ వచ్చే చాన్స్ మీకోసం అని అభిమానులను ఆహ్వానించాడు.


Click it and Unblock the Notifications











