SRK+ : తన సొంత OTT ప్రకటించిన షారుఖ్ ఖాన్.. వాటితో పోటీగా రంగంలోకి?
షారుక్‌ని తిరిగి తెరపై చూడాలని అతని అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అతని ఫస్ట్ లుక్ రివీల్ అయింది. పఠాన్ కాకుండా షారుక్ తన అభిమానులకు మరో పెద్ద సర్ ప్రైజ్ ఇస్తున్నారు. అవును, షారుక్ తన తాజా ట్వీట్‌లో తన సర్ ప్రైజ్ కి సంబంధించిన సూచనలు ఇచ్చారు. 'SRK + కమింగ్ సూన్' పోస్టర్‌తో షారుక్ హింట్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇటీవల కాలంలో భాషకు అతీతంగా డైరెక్ట్ గా ఓటీటీలో చిన్న సినిమాల మొదలు భారీ సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. ఒకానొక సమయంలో థియేటర్ల మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడేలా మారడంతో వారంతా గగ్గోలు పెట్టారు. తరువాత కరోనా పరిస్థితులు కుదుట పడ్డాయి కానీ ఇప్పుడు ఆ ఊపులో పలు కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. అలా ప్రాంతీయభాషల్లోనూ పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పుట్టుకు వస్తున్నాయి.

SRK+ లోగో
ఆ సంగతి పక్కన పెడితే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కూడా ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. ఇప్పటికే పలు వ్యాపారాలు చేస్తూ బాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న షారుఖ్ ఓటీటీలోకి అడుగు పెడితే ఆ పోటీ రసవత్తరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్ లో 'కుచ్ కుచ్ హోనే వాలా హై, ఓటీటీకి దునియా మే' (ఓటీటీ ప్రపంచంలో ఏదో జరగబోతోంది) అంటూ షారుఖ్ చేసిన ట్వీట్ బ్యాక్ డ్రాప్ లో SRK+ లోగో కూడా ఉంది.

ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోగో
అయితే ఆ లోగో షారుఖ్ సొంతంగా స్థాపించనున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోగో అనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఇతర వివరాలేవీ బయటకు రాలేదు. 'త్వరలో రాబోతోంది.' అని షారుఖ్ ఇచ్చిన కామెంట్ తప్ప వేరే అప్‌డేట్ లేదు. మిలియన్ల మంది అభిమానులు ఉన్న షారుఖ్ ఇప్పటికే ఐపీఎల్ లో 'కలకత్తా నైట్ రైడర్స్' వంటి టీమ్ తో విజయవంతమైన బిజినెస్ మేన్ అని నిరూపించుకున్నారు.

రాత్రి పార్టీ
సల్మాన్ ఖాన్ 'షారుఖ్ న్యూ ఓటీటీ యాప్ లాంచ్ చేసినందుకు కంగ్రాట్స్. ఈ రోజు రాత్రి పార్టీ ఇవ్వాలి' అని శుభాకాంక్షలు తెలిపాడు. కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్‌తో సహా పలువురు సెలబ్రిటీలు బాద్‌షా సక్సెస్ కావాలని కోరుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో షారుక్ ప్రకటనపై యూజర్ల ఊహాగానాలు కూడా కరెక్ట్ అని తేలిపోయింది.

సినిమానా లేక వెబ్ సిరీస్
కింగ్ ఖాన్ తన సొంత ప్రొడక్షన్ ద్వారా కుమారుడిని అరంగేట్రం చేయించవచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు అజయ్ దేవగన్, షాహిద్ కపూర్, అనిల్ కపూర్ మరియు మాధురీ దీక్షిత్ OTTలో అడుగుపెట్టారు మరియు ఇప్పుడు కింగ్ ఖాన్ కూడా OTT ప్లాట్‌ఫామ్‌లో అడుగు పెట్టబోతున్నారు. అయితే ఇది సినిమానా లేక వెబ్ సిరీస్ అవుతుందా? అనే ప్రశ్నకు షారూక్ త్వరలో తన అభిమానులకు సమాధానం ఇవ్వనున్నారు.


Click it and Unblock the Notifications











