Dunki డంకీ మూవీపై నెటిజన్ ఘాటైన ప్రశ్న.. సహనం కోల్పోయి షారుక్ ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా?
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన డంకీ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాాన్ని అందుకొన్నది. అయితే డంకీ విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో తన అభిమానులు, నెటిజన్లతో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు ఆయన ఇరిటేట్ అయ్యారు. నెటిజన్ అడిగిన ప్రశ్న ఏమిటి? షారుక్ చెప్పిన జవాబు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
డంకీ బాక్సాఫీస్ వద్ద తడాఖా చూపిస్తున్న నేపథ్యంలో #AskSRK అంటూ అభిమానులు, నెటిజన్లతో ముచ్చటించారు. ఈ చాటింగ్ సందర్భంగా ఆయనకు భారీగా ప్రశ్నలు వేశారు. అయితే వాటిలో కొన్నింటికి సరదా సరదాగా సమాధానాలు ఇచ్చారు. అయితే డంకీ సినిమా బడ్జెట్ గురించి అడిగిన ప్రశ్నకు కాస్త ఇరిటేట్ అయినట్టు కనిపించారు.

షారుక్ ఖాన్‌కు #AskSRK ఛాటింగ్ సందర్భంగా ఓ నెటిజన్ ప్రశ్న వేస్తూ.. సార్.. డంకీ బడ్జెట్‌పై రకరకాల రూమర్లు మీడియాలో వినిపిస్తున్నాయి. కొందరు ఈ సినిమా బడ్జెట్ 85 కోట్లు అని, మరికొందరు 120 కోట్ల రూపాయలు అని.. మరికొందరు 350 కోట్ల రూపాయలు అని అంటున్నారు. అయితే డంకీ కొట్టే కొట్టిన మీరు నోటి నుంచే నా ప్రశ్నకు సమాధానం వస్తుందని అనుకొంటున్నాను అని నెటిజన్ ప్రశ్న వేశారు.
అయితే నెటిజన్ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. బ్రో.. ఆ విషయాలు మీకు అవసరమా? బిజినెస్ చేసేవారికి ఈ బడ్జెట్ లెక్కలు వదిలేయండి. ఆ గొడవ వాళ్లు చూసుకొంటారు. మీరు అనవసరమైన విషయాల మీద మీ సమయాన్ని వృథా చేసుకోకుండా మరో మంచి విషయంపై దృష్టిపెట్టండి అంటూ కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చారు.

ఇక డంకీ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. షారుక్ ఖాన్ కెరీర్‌లోనే అతి తక్కువ వ్యయంతో తెరకెక్కించారనే విషయం మీడియాలో వస్తున్నది. ఈ సినిమాకు 85 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల విజయం సాధించిన పఠాన్ చిత్రం 240 కోట్లు, జవాన్ చిత్రం 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.
ఇదిలా ఉండగా, షారుక్ ఖాన్ నటించిన డంకీ చిత్రం గత 6 రోజుల్లో 285 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 13 మిలియన్ డాలర్లు అంటే.. 104 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. 7వ రోజున ఈ సినిమా 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్ేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











