పదే పదే అవే ప్రశ్నలు.. విసుగెత్తిపోతోన్న బాద్ షా.. ఫ్యాన్స్‌తో షారుఖ్ చిట్ చాట్
స్టార్ హీరోలు తమ అభిమానులను అలరించేందుకు వరుసగా సినిమాలను చేస్తుంటారు. నిత్యం ఫ్లాపులు పలకరించినా, డిజాస్టర్లు వచ్చినా కూడా హిట్ కొట్టేందుకు, అభిమానులను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా ప్రయత్నాలు చేసి చేసి కింగ్ ఖాన్ విసుగెత్తిపోయాడు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ డిజాస్టర్లతో కుంగిపోయాడు. గత మూడు నాలుగేళ్లు ఒక్క సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయాడు.

వరుసగా డిజాస్టర్లు..
2013లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ షారుఖ్ ఖాన్ కొట్టిన చివరి హిట్. అప్పటి నుంచి తన అభిమానుల అలరించేందుకు షారుఖ్ ఖాన్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దిల్ వాలే, ఫ్యాన్, హ్యాపీ న్యూ ఇయర్, డియర్ జిందగీ, రాయిస్, జబ్ హారీ మెట్ సెజల్, జీరో ఇలా ప్రతీ సినిమా డిజాస్టర్ అయింది. చివరగా జీరో చిత్రంతో 2018 ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కొంటెచూపుతో కవ్విస్తోంది.. తారా సుతారియా హాట్ పిక్స్

హీరోగా సినిమాలు..
2018లో వచ్చిన జీరో చిత్రంతో నిజంగానే షారుఖ్ ఖాన్ జీరో అయిపోయాడనే సెటైర్లు వచ్చాయి. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు షారుఖ్ హీరోగా ఒక్క సినిమాను కూడా సైన్ చేయలేదు. కేవలం కొన్ని చిత్రాలను నిర్మించాడు. షారుఖ్ ఖాన్ మళ్లీ తన సత్తా చాటుతాడని అభిమానులు ఆశగా ఉన్నారు.
చిరునవ్వే విసిరావే.. ఎవ్లీన్ శర్మ పిక్స్ వైరల్

కొత్త ప్రాజెక్ట్‌పై రూమర్లు..
షారుఖ్ ఖాన్ అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతోందనే టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. పటాన్ అనే చిత్రంలో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్స్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి ఎన్‌ఐఏ అధికారి, మరొకటి గ్యాంగ్ స్టర్. ఈ రెండు పాత్రల్లో షారుఖ్ కనిపించబోతోన్నట్టు టాక్.
షర్ట్ విప్పేసి అందాల విందు.. సాక్షి అగర్వాల్ రచ్చ

తాజాగా అలా..
తాజాగా షారుఖ్ ఖాన్ ట్విట్టర్‌లో తన ఫ్యాన్స్‌తో ముచ్చట్లు పెట్టేశాడు. ఈ క్రమంలో అందరూ కూడా తన తదుపరి చిత్రం గురించే అడుగున్నారు. నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది? అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
బీచ్‌లో అందాల ఆరబోత.. హీనా ఖాన్ రచ్చ

రిప్లై అదుర్స్..
అనౌన్స్‌మెంట్లు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఎయిర్ పోర్టుల్లో అవుతుంటాయని షారుఖ్ కౌంటర్ వేశాడు. ఈ ఏడాది చాలా మంది వస్తున్నారు.. మనకు ఇంకా టైం ఉంది.. త్వరలోనే చెబుతాను అంటూ ఇలా దాటవేసే ప్రయత్నాలు షారుఖ్ చేశాడు. అందరూ కూడా డిజాస్టర్లకు సీక్వెల్స్ అడుగుతున్నారెందుకు అని షారుఖ్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











