Dunki Movie: రాజ్ కుమార్ హిరాణీతో షారుఖ్ సినిమా.. ఆశలు పెట్టుకుంటున్న బాలీవుడ్

'పఠాన్'తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరో సినిమా ప్రకటించలేదు. ఆయన ఎలాంటి సినిమాలో నటిస్తారు? మళ్ళీ మునుపటి ఫామ్ లోకి రావడానికి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని అనేక ప్రచారాలు చేయగా ఎట్టకేలకు ఆ విషయం మీద క్లారిటీ వచ్చేసింది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా ఒక సినిమాను ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే

 మంచి పేరు

మంచి పేరు


రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా 'డంకి' అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన తాప్సీ పన్ను నటించనున్నారు. షారుఖ్, రాజ్ కుమార్ హిరాణీ కలయికలో ఇది మొదటి సినిమా కాగా రాజ్ కుమార్ హిరాణీకి బాలీవుడ్ లో మంచి పేరు ఉంది. ఆయన 'మున్నాభాయ్' సిరీస్, 'త్రీ ఇడియట్స్', 'పీకే', 'సంజు' సినిమాలతో రాజ్ కుమార్ హిరాణీ మంచి పేరు తెచ్చుకున్నారు.

 ఆసక్తికరంగా

ఆసక్తికరంగా


ఇక షారుఖ్‌తో ఈ సినిమా ప్రకటన కూడా ఆసక్తికరంగా ఉంది. ముందుగా రాజ్ కుమార్ హిరాణీ ఆఫీసుకు షారుఖ్ వెళ్ళడం... ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కూడా ఆసక్తికరంగా సాగింది. కామెడీ ఉందా? అని షారుఖ్ ప్రశ్నించగా దానికి చాలా ఉందని, రాజ్ కుమార్ హిరాణీ సమాధానం ఇస్తాడు. ఇక ఎమోషన్? అని షారుఖ్ సందేహం వ్యక్తం చేయగా అదీ ఉందని అంటాడు రాజ్ కుమార్ హిరాణీ.

షారుఖ్ నుంచి రెండు సినిమాలు

షారుఖ్ నుంచి రెండు సినిమాలు


ఇక రొమాన్స్ ఉందా సార్? అని తన ఐకానిక్ ఫోజు పెడుతూ షారుఖ్ అడిగితే ఉంది సార్ కానీ, ఇలాంటి సమయంలో అవాయిడ్ చేద్దామని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా జానర్ ఏమిటి? సినిమా కథ ఎలా ఉండబోతుంది అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. నీ, వచ్చే ఏడాది డిసెంబర్ 23న సినిమాను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. అంటే... 2023లో షారుఖ్ నుంచి రెండు సినిమాలు రావడం కన్ఫర్మ్ అన్నమాట.

సరైన దర్శకుడు లేడు

సరైన దర్శకుడు లేడు


సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటిస్తున్న పఠాన్ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
హిందీ బెల్ట్‌లో రాణించగల సామర్థ్యం ఉన్న కొంతమంది బాలీవుడ్ డైరెక్టర్ లు ఉన్నారు కానీ నార్త్ మరియు సౌత్ లలో ఒకేలా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి అక్కడ సరైన దర్శకుడు లేడు.

 బాలీవుడ్ కు కలిసి వచ్చేలా

బాలీవుడ్ కు కలిసి వచ్చేలా


అయితే దేశంలోని అన్ని ప్రధాన సర్క్యూట్‌లలో అంచనాలను పెంచే సామర్థ్యం ఉన్న బాలీవుడ్ చిత్రంగా ఈ సినిమా నిలవచ్చని అంటున్నారు. షారుఖ్ ఇప్పటికే సౌత్ డైరెక్టర్ అట్లీతో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. అలాంటి ఆయన ఇప్పుడు హిరానీతో కలిసి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను సెట్ చేశాడు. మొత్తం మీద ఈ సినిమా బాలీవుడ్ కు కొంత వరకు కలిసిరావచ్చని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X