సచిన్ టెండూల్కర్‌కు కంగ్రాట్స్ చెప్పిన షారుక్ ఖాన్.. వావ్ మూమెంట్స్ అంటూ ట్వీట్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ప్రస్తుతం విజయయాత్రను కొనసాగిస్తున్నాడు. ఆయన నటించిన పఠాన్ చిత్రం రికార్డు కలెక్షన్లు సాధించడమే కాకుండా హిందీ సినిమా చరిత్రలో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక ఐపీల్ 2023 టోర్నీలో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయాలతో ముందుకెళ్తున్నది. కేకేఆర్ జట్టుకు యజమానిగా ఉన్న షారుక్ ఖాన్ తన ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్‌కు కోచ్‌గా ఉన్న సచిన్ టెండూల్కర్‌కు కంగ్రాట్స్ చెప్పారు. అయితే సచిన్‌కు ఎందుకు కంగ్రాట్స్ చెప్పారనే విషయంలోకి వెళితే..
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఐపీఎల్ టోర్నమెంట్‌లో ముంబై జట్టకుకు ప్రాతినిత్యం వహించిన అర్జున్ టెండూల్కర్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ తన ఫాస్ట్ బౌలింగ్‌తో ఆకట్టుకొన్నాడు. తొలి మ్యాచ్‌లోని క్రికెట్ అభిమానులను మెప్పించాడు. సచిన్ టెండూల్కర్ అభిమానులు అర్జున్‌కు అండగా నిలిచారు.
అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ ఎంట్రీని పురస్కరించుకొని సచిన్ టెండూల్కర్‌కు షారుక్ ఖాన్ అభినందనలు తెలిపాడు. షారుక్ ఖాన్ ట్వీట్ చేస్తూ... ఐపీఎల్‌లో నా జట్టు పోటీ పడుతున్నప్పటికీ.. నా ఫ్రెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్‌లో ఎంట్రీ ఇవ్వడం నాకు చాలా ఆనందంతో ఉత్సాహం కలిగింది. అర్జున్‌కు నా తరఫు నుంచి ఆల్ ది బెస్ట్. సచిన్ టెండూల్కర్ తండ్రిగా గర్వించ దగిన క్షణాలు అంటూ షారుక్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక షారుక్ ఖాన్ విషయానికి వస్తే.. పఠాన్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా 1050 కోట్లకుపైగానే కలెక్షన్లను సాధించాడు. తన కెరీర్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును నెలకొల్పాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో తన జట్టు ట్రోఫి గెలుస్తుందో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











