గాలి ద్వారా కరోనా.. షారుక్ ఖాన్ ఇంటికి ప్లాస్టిక్ కవర్స్.. అది నిజం కాదట?

దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహారాష్ట్ర రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో బాలీవుడ్ స్టార్స్ లో ఆందోళన పెరిగింది. అయితే రీసెంట్ గా షారుక్ ఖాన్ తన ఇంటిని గాలి సోకకుండా ప్లాస్టిక కవర్స్ ఏర్పాటు చేసుకోవడం వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత జాగ్రత్తగా ఉండాలని..

మరింత జాగ్రత్తగా ఉండాలని..


బాలీవుడ్ లో ఇప్పటికే కొంతమంది స్టార్ సెలబ్రెటీస్ కి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఎంతో జాగ్రత్తగా ఉండే అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కూడా కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో మరింత జాగ్రత్తగా ఉండాలని స్టార్ సెలబ్రెటీస్ ముందు జాగ్రత్తగా తగిన చర్యలు తీసుకుంటున్నారు. కరొనాతో ఏ మాత్రం రిస్క్ చేయకూడదని ఫిక్స్ అయ్యారు.

గాలి ద్వారా కరోనా..

గాలి ద్వారా కరోనా..

ఇక కరొనా వైరస్ గాలి ద్వారా కూడా సోకే అవకాశం ఉందనే ప్రతిపాదనను కొట్టిపారేయలేమని ప్రపంచం ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం కొత్త అనుమానాలకు దారి తీస్తుండడంతో చాలా మంది సెలబ్రెటీస్ చేడు గాలికి దూరంగా ఉంటున్నారు. ఇక షారుక్ ఖాన్ కూడా అందుకోసమే తన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు టాక్ వస్తోంది.

షారుక్ ఇంటికి ప్లాస్టిక్ కవర్స్

షారుక్ ఇంటికి ప్లాస్టిక్ కవర్స్


ముంబైలోని తన బంగ్లాకు షారుక్ ఖాన్ ప్లాస్టిక్ కవర్స్ ఉంచడంతో కరోనా వైరస్ కారణంగానే అలా చేశారని టాక్ వస్తోంది. ముంబైలో రోజురోజుకి కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవ్వడం వలన షారుక్ బయట నుంచి డైరెక్ట్ గా గాలి లోపలికి రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Recommended Video

Shahrukh Khan's Daughter Suhana Khan Latest Photoshoot
అసలు మ్యాటర్ ఏమిటెంటే..

అసలు మ్యాటర్ ఏమిటెంటే..


గతంలో చాలా సార్లు షారుక్ ఖాన్ ఇలాగే తన ఇంటికి ప్లాస్టిక్ కవర్స్ వేశారు. పలుమార్లు ప్రైవసీ కోసమే ఆయన ఇలా చేస్తుంటారని కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే షారుక్ వివరణ ఇచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. గత కొన్ని నెలలుగా షారుక్ తన ఫ్యామిలీతో ఇంట్లోనే ఉంటున్నాడు. వైరస్ తీవ్రత తగ్గే వరకు బయటకు వెళ్లకుడదని షారుక్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X