మెగాస్టార్ ఫ్యామిలీ హీరోతో షారూక్ కూతురు లవ్.. పార్టీలో అడ్డంగా దొరికిన కొత్త జంట
మిగిలిన సినిమా పరిశ్రమలతో పోల్చుకుంటే బాలీవుడ్ నుంచే ఎక్కువగా స్టార్లు తమ వారసులను పరిచయం చేస్తున్నారు. ఒకవేళ చేయకపోయినా అలాంటి వాళ్లంతా చిన్న ఏజ్‌లోనే హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఒకరు. ఈ అమ్మడు సినిమా కెరీర్‌ను పూర్తిగా ప్రారంభించకుండానే ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సుహానా ఖాన్ తన ప్రియుడితో కలిసి ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!
చిన్నప్పుడే ఫుల్ పాపులర్
బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ డాటర్‌గా టీనేజ్‌లో ఉన్నప్పుడే సుహానా ఖాన్ యమా ఫేమస్ అయింది. అలాగే, తరచూ తండ్రితో కలిసి ఈవెంట్లకు హాజరవుతూ.. క్రికెట్ మ్యాచ్‌ల్లో సందడి చేస్తూ.. పార్టీలు, పబ్‌లలో హడావిడి చేస్తూ.. గ్లామర్ షో ఇస్తూ ఇలా ఎన్నో రకాలుగా ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది. దీంతో చిన్న వయసులోనే సుహానా సంచలనంగా మారిపోయింది.

ఆ మూవీతో ఎంట్రీ ఇచ్చి
హీరోయిన్‌గా సుహానా ఖాన్ ఎంట్రీ ఇస్తుందని చాలా ఏళ్లు టాక్ నడిచింది. కానీ, అభిమానుల కోరిక మాత్రం తీరలేదు. దీంతో ఆమె సినిమాల్లోకి రాదని అంతా అనుకున్నారు. అయితే, గత ఏడాది సుహానా 'The Archies' అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ మూవీలో అమితాబ్ మనవడు అగస్త్య నందా హీరోగా, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ నటించారు.
మెగాస్టార్ మనవడితో లవ్
ఉన్నత చదువులు చదువుతోన్న సమయంలోనే సుహానా ఖాన్ డేటింగ్‌ల గురించి చాలా రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడామె అమితాబ్ మనవడు అగస్త్య నందాతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఈ మధ్యన బీ టౌన్‌లో టాక్ వచ్చింది. వీళ్లిద్దరూ కలిసి 'The Archies' మూవీ షూటింగ్ చేస్తోన్నప్పుడే ప్రేమలో పడ్డారని వార్తలు గుప్పుమంటున్నాయి.

సీక్రెట్‌గా తిరుగుతూనే
బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అగస్త్య నందా చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, వీళ్లిద్దరూ దీనిపై ఎప్పుడూ స్పందించలేదు. కానీ, చాలా రోజులుగా ఈ కొత్త జంట సీక్రెట్‌గా తిరుగుతూ హల్చల్ చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు, అప్పుడప్పుడూ పార్టీలు, పబ్బుల్లోనూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారు.
లండన్‌లో పార్టీ చేశారు
షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, మితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందాతో కలిసి లండన్‌లో జరిగిన ఓ పార్టీలో కలిసి కనిపించారని సమాచారం. లండన్‌లోని ఓ నైట్ క్లబ్‌లో సుహానా ఖాన్, అగస్త్య మాట్లాడుకుంటూ కనిపించారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో వీళ్లిద్దరి డేటింగ్ వార్తలకు మరోసారి బలం చేకూరిందని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











