Suhana Khan: బాత్‌టబ్‌లో షారూక్ కూతురు రచ్చ.. స్నానం చేసే వీడియో పెట్టిందేంటి!

ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీల కంటే బాలీవుడ్‌లోని స్టార్ల వారసులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వీళ్లంతా చిన్న వయసు నుంచే తమదైన వ్యవహార శైలితో సెన్సేషన్ అవుతూ ఉంటారు. అందులో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఒకరు.

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే నిలుస్తూ ఉంటోంది. ఇక, ఈ మధ్యనే కెరీర్ మొదలు పెట్టి.. ఇప్పుడు బిజీగా మారిపోయింది. అయినా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇలా ఇప్పుడు సుహానా కొన్ని పిక్స్, వీడియో వదిలింది. అవి మీరే చూసేయండి!

Shah Rukh Khan Daughter Suhana Khan Shares Crazy Pics and Video

టీనేజ్‌లోనే ఫుల్ పాపులర్
బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కూతురిగా టీనేజ్‌లో ఉన్నప్పుడే సుహానా ఖాన్ ఫుల్ పాపులర్ అయింది. అలాగే, తరచూ తండ్రితో కలిసి ఈవెంట్లకు హాజరవుతూ.. క్రికెట్ మ్యాచ్‌ల్లో సందడి చేస్తూ.. పార్టీలు, పబ్‌లలో హడావిడి చేస్తూ.. అందాలను ఆరబోస్తూ ఇలా ఎన్నో రకాలుగా ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది. దీంతో చిన్న వయసులోనే సుహానా సెన్సేషన్‌ అయిపోయింది.

Shah Rukh Khan Daughter Suhana Khan Shares Crazy Pics and Video

ఫారెన్ కల్చర్‌తో విమర్శలే

సుహానా ఖాన్ చాలా ఏళ్ల క్రితమే తన హయ్యర్ స్టడీస్ కోసం ఫారెన్ వెళ్లింది. కాబట్టి అక్కడి కల్చర్‌కు ఆమె బాగా అలవాటు పడింది. ఇలా కూడా చాలా సార్లు ఈ అమ్మడు హాట్ టాపిక్‌ అయింది. అప్పట్లో ఈమె గురించి ఎన్నో ఊహించని పుకార్లు కూడా ఓ రేంజ్‌లో ప్రచారం అయ్యాయి. దీంతో షారూక్ ఖాన్ అభిమానులు సైతం సుహానా ఖాన్ తీరుపై విమర్శలు వ్యక్తం చేసేశారు.

Shah Rukh Khan Daughter Suhana Khan Shares Crazy Pics and Video

ఆ సినిమాతో పరిచయం
సుహానా ఖాన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందని చాలా ఏళ్లు టాక్ నడిచింది. కానీ, ఫ్యాన్స్ కోరిక మాత్రం తీరలేదు. దీంతో ఆమె సినిమాల్లోకి రాదని అంతా అనుకున్నారు. అయితే, గత ఏడాది సుహానా 'The Archies' అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ మూవీలో అమితాబ్ మనవడు అగస్త్య నందా హీరోగా, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ నటించారు.

మెగాస్టార్ మనవడితో లవ్

హయ్యర్ స్టడీస్ చదువుతోన్న సమయం నుంచే సుహానా ఖాన్ డేటింగ్‌ల గురించి చాలా రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడామె అమితాబ్ మనవడు అగస్త్య నందాతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఈ మధ్యన బీ టౌన్‌లో టాక్ వచ్చింది. వీళ్లిద్దరూ కలిసి 'The Archies' మూవీ షూటింగ్ చేస్తోన్నప్పుడే ప్రేమలో పడ్డారని ప్రచారం జరుగుతోంది.

Shah Rukh Khan Daughter Suhana Khan Shares Crazy Pics and Video

సోషల్ మీడియాలో బిజీ
షారూక్ ఖాన్ కూతురిగా చిన్న వయసులో ఉన్నప్పుడే సుహానా ఖాన్ పాపులర్ అయింది. అలాగే, సోషల్ మీడియా ద్వారా ఈ పిల్ల మరింత పాపులారిటీని దక్కించుకుంది. ఇందులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోన్న ఈ కుర్రది.. తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలూ వదులుతూ వెళ్తోంది.

ఎక్కువగా గ్లామరస్ పిక్స్

సుహానా ఖాన్ సోషల్ మీడియాలో చాలా కాలంగా ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన ఘాటు ఫొటోలను తరచూ వదులుతోంది. దీంతో సుహానా ఖాన్ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు రెస్పాన్స్ లభిస్తూనే ఉంటోంది.

రెచ్చిపోయిన సుహానా
ఈ మధ్యన గ్లామర్ షోతో సోషల్ మీడియాను ఊపేస్తోన్న సుహానా ఖాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలు, ఓ వీడియోను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు బాత్‌టబ్‌లో స్నానం చేస్తూ బోల్డు షో చేసింది. ఫలితంగా ఆమె అందాలు తెగ కవ్విస్తున్నాయి. దీంతో సుహానా లేటెస్ట్ హాట్ పోస్టుకు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో పిక్స్, వీడియో వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X