twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంటర్నెట్‌లో సూపర్‌స్టార్ కూతురు వీడియో.. హాట్ టాపిక్‌గా బేబీ వ్యవహారం!

    |

    బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ సినిమాల్లోకి రాబోతుందా..? ఆమె చేసిన తొలి ప్రయత్నం అందులో భాగమేనా..? సుహానా ఫొటోను వైరల్ చేయడానికి కారణం అదేనా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో హల్‌చల్ చేస్తోన్న సుహానా ఖాన్‌కు సంబంధించిన ఓ పిక్ తాజాగా వైరల్ అవుతోంది. ఆమె.. తన క్లాస్‌మేట్ తెరకెక్కించిన ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. దీనికి సంబంధించిన పిక్‌ను షారూఖ్ ఫ్యాన్ పేజ్‌లో షేర్ చేశారు. అంతేకాదు, ఇది సుహానా నటించిన షార్ట్ ఫిల్మ్‌లోనిది అని క్యాప్షన్ పెట్టారు. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఈ ఫొటోలో సుహానా కారు లోపల కూర్చుని ఉంది. ఈ పిక్ చూసిన వారంతా షారూఖ్ డాటర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో సుహానాకు సంబంధించిన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది.

    యూట్యూబ్‌లో వీడియో

    యూట్యూబ్‌లో వీడియో

    కొద్ది రోజులుగా సుహానాకు సంబంధించిన ఓ వీడియో విడుదలైంది. ఇందులో ఆమెను చాలా క్లోజ్‌గా చూపించారు. ఇందులో ఆమె బాలీవుడ్‌ నటిలానే కనిపించింది. ఈ వీడియోను విడుదల చేసిన వారు ‘చించేసింది' అని క్యాప్షన్ కూడా పెట్టారు. నిజానికి సుహానా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో భావిస్తోంది. కాకపోతే ప్రస్తుతం ఆమె ఇంగ్లండ్‌లో చదువుకుంటోంది. తన చదువు పూర్తయిన వెంటనే సినీ రంగ ప్రవేశం చేసేందుకు ఆమె సిద్దం కానుంది.

    సుహానా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ

    సుహానా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ

    సుహానా ఖాన్ గురించి కొద్దిరోజుల క్రితం ఆమె తండ్రి షారుక్ కూడా స్పష్టం చేశాడు. ‘‘సుహానా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. కానీ, ప్రస్తుతం ఆమె చదువుకుంటోంది. ఆమె కనీసం డిగ్రీ అయినా పూర్తి చేసి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది'' అని చెప్పుకొచ్చాడు. అదే ఇంటర్వ్యూలో సుహానా యాక్టింగ్ స్కిల్స్ గురించి కూడా మాట్లాడాడు. ‘‘సుహానాకు యాక్టర్ కావాలని ఉంది. ఆమె బాలీవుడ్ ఎంట్రీపై ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోంది అని అన్నారు.

    యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ

    యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ

    మరో ఆరు నెలల్లో సుహానా చదువు పూర్తవుతుంది. ఆ తర్వాత నటనలో మెలకువలు నేర్చుకునేందుకు యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ అవుతుంది. దీనికి మూడు నాలుగేళ్ల సమయం పట్టొచ్చు'' అని వెల్లడించాడు. మరోవైపు, సుహానా ఇటీవల కోల్‌కతాలో జరిగిన ఓ వివాహానికి హాజరైంది. ఆ సందర్భంగా తీసిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు, ఇటీవల ఆమె తన స్నేహితులు అనన్య పాండే, శాన్యా కపూర్‌, సోదరుడు ఆర్యన్‌తో ఉన్న ఫొటోలు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

    ఇంటర్నెట్ సెన్సేషన్‌గా సుహానా ఖాన్

    ఇంటర్నెట్ సెన్సేషన్‌గా సుహానా ఖాన్

    షారూక్, గౌరీ గారాల దంపతుల కుమార్తు సుహానా ఖాన్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌తో పంచుకుంటుంటుంది. దీనితో పాటు తన ఫొటోలను కూడా షేర్ చేస్తుంటుంది. ఆమె ఫొటోల పట్ల నెటిజన్లు చాలా ఆసక్తినే ప్రదర్శిస్తుంటారు. వీటిని షారుఖ్ ఫ్యాన్స్ ఇంటర్నెట్‌లో షేర్ చేయడంతో సుహానా ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఆమె కొద్దిరోజుల క్రితం బికినీ ఫొటోలు, చీరకట్టులో ఉన్న పిక్‌లను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి విధితమే.

    English summary
    Suhana Khan's latest still from her upcoming short film, which is being directed by one of her school friends, proves that the star-kid is ready to take Bollywood by storm in the coming future. In the black and white picture, Suhana is seen sitting inside a car.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X