For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shah Rukh Khan's Pathan.దేశ సినీ చరిత్రలో ఏ చిత్రం సాధించని ఘనత..దీపిక పదుకోన్‌తో హ్యట్రిక్ కొట్టేందుకు బాద్షా

  |

  సినీ పరిశ్రమలో ఏ హీరోనైనా ఫెయిల్యూర్స్ వెంటాడటం సహజంగానే కనిపిస్తాయి. అందుకు షారుక్ ఖాన్ అతీతుడు కాదనిపిస్తుంది. ఎందుకంటే గత నాలుగైదు సంవత్సరాలుగా వరుస పరాజయాలు ఆయనను వెక్కిరించడంతో షారుక్ ముఖానికి మేకప్ వేసుకొకుండా ఇంటికే పరిమితమయ్యారు. అయితే సక్సెస్ బాట పట్టుకోవడానికి ప్రస్తుతం దీపిక పదుకోన్‌తో కలిసి పఠాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  2018 నుంచి హిట్టు లేకుండా...

  2018 నుంచి హిట్టు లేకుండా...

  షారుక్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. దిల్ వాలే తర్వాత గట్టిగా హిట్ కొట్టిన దాఖలాలు లేవు. ఫ్యాన్, ట్యూబ్‌లైట్, జబ్ హ్యారీ మెట్ సెజల్, జీరో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి. ప్రస్తుతం నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ రూపొందిస్తున్న పఠాన్‌ చిత్రం, అలాగే తమిళ దర్శకుడు అట్లీతో సంకీ అనే చిత్రాల్లో నటిస్తూ పూర్వవైభవాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

  అతిథి పాత్రలతో షారుక్ ఖాన్ బిజీగా

  అతిథి పాత్రలతో షారుక్ ఖాన్ బిజీగా

  అంతేకాకుండా షారుక్ ఖాన్ అతిథి పాత్రలో కూడా పలు చిత్రాల్లో తెర మీద మెరిసేందుకు ప్లాన్ చేశారు. బ్రహ్మాస్త్ర‌లో అతిథి పాత్రకు మించిన రోల్‌లో, రాకేట్రీ: ది నంబి ఎఫెక్ట్‌ చిత్రంలో, అమీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో గెస్ట్ రోల్స్‌తో ఆలరించనున్నారు. సుమారు 300 కోట్లతో రూపొందుతున్న పఠాన్ చిత్రం 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేశారు.

  దీపిక పదుకోన్‌తో హ్యట్రిక్‌

  దీపిక పదుకోన్‌తో హ్యట్రిక్‌

  దీపిక పదుకోన్‌తో షారుక్ ఖాన్ నటించడం ఇది మూడోసారి. చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాల్లో నటించి వరుస హిట్లను సొంతం చేసుకొన్నారు. ప్రస్తుతం పఠాన్ చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యారు. పఠాన్ చిత్రంలో షారుక్, దీపక మధ్య ఉన్న కెమిస్ట్రీ అదుర్స్ అనే రేంజ్‌లో ఉంటుందని పేర్కొంటున్నారు.

  స్పెయిన్‌లో అందమైన ప్రదేశాల్లో..

  స్పెయిన్‌లో అందమైన ప్రదేశాల్లో..

  పఠాన్ చిత్రం ప్రస్తుతం స్పెయిన్‌లో జోరుగా షూటింగు జరుపుకొంటున్నది. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడమే కాకుండా ఓ మాంటేజ్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. స్పెయిన్‌లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా షూటింగ్ జరుపుకొని ప్రదేశంలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. స్పెయిన్‌లో సిద్దార్థ్ ఆనంద్ అందమైన లొకేషన్లను ఎంపిక చూసుకొని పాటను చిత్రీకరించారు. తప్పకుండా ఈ సినిమా, పాటలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు లీక్ కాకుండా గట్టి చర్యలు తీసుకొంటున్నారు అని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

  Surekha Sikri Life Story, నేషనల్ అవార్డ్ నటి.. Naseeruddin Shah కి బంధువు!! || Filmibeat Telugu
  దేశ సినీ చరిత్రలోనే సరికొత్తగా

  దేశ సినీ చరిత్రలోనే సరికొత్తగా


  స్పెయిన్‌లో షూటింగు జరుపుకొంటున్న పఠాన్ చిత్రంలోని సీన్లు వెండితెర మీద దృశ్యకావ్యంలా ఉంటాయి. ప్రపంచ పటంలో ఇండియన్ సినిమాకు ఆనంద్, ఆదిత్య చోప్రా కొత్త నిర్వచనం చెప్పబోతున్నారు. స్పై, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పఠాన్ చిత్రం భారతీయ సినిమా రంగంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం అని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

  English summary
  Shah Rukh Khan, Deepika Padukone's Pathan shooting at Spain. Aditya Chopta and Siddharth Anand planned well for shoot. Unit is shooting at place where No Bollywood film has ever shot in Spain.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X