Pathaan: హద్దు దాటిన షారుక్ ఫ్యాన్స్ అభిమానం.. థియేటర్‌లో బాంబుల మోత.. భయానక సన్నివేశం!
బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఒక స్టార్ హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ బాద్ షా గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న స్టార్ హీరో షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన హడావిడి చూస్తూ ఉంటే చాలా రికార్డులు బ్రేక్ అయ్యేలా ఉన్నాయి అనిపిస్తోంది. అయితే కొంతమంది అభిమానుల సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా విధానాన్ని చూస్తే భయాన్ని కలిగిస్తోంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఒక థియేటర్లో కొంతమంది ఫ్యాన్స్ చేసిన సంబరాలు చాలా వరకు మీతిమీరిపోయాయి. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సరికొత్త సెన్సేషన్
బాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న షారుఖ్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ చూసి చాలా కాలమయ్యింది. ఇక ఈసారి ఎలాగైనా పఠాన్ సినిమాతో సక్సెస్ అందుకోవాలి అని అతను ఎంతో గ్యాప్ తీసుకొని మరి ఈ సినిమాను చేశాడు. ఇక మొత్తానికి పఠాన్ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా షారుక్ ఖాన్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది.

బాక్సాఫీస్ రికార్డులు
ఇక పఠాన్ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ రోజు రోజుకు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం విశేషం. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ అందుతున్నాయి. ముఖ్యంగా షారుక్ ఖాన్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను చూసి థియేటర్లో చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

మితిమీరిన అభిమానం
అయితే కొన్నిసార్లు మితిమీరిన అభిమానం ఊహించని ఘటనలకు దారితీస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీలో అయితే చాలా వరకు లిమిట్స్ దాటి ఫ్యాన్స్ ప్రవర్తిస్తున్నారు అని థియేటర్స్ యాజమాన్యాలు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాయి. కొందరు అయితే ఏకంగా స్క్రీన్స్ చింపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి పొరపాట్లు జరగకుండా చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా మళ్లీ రిపీట్ అవుతున్నాయి.

థియేటర్స్ లోనే షాట్స్
ఇక రీసెంట్ గా ఒక థియేటర్లో అయితే పటాన్ సినిమాను చూస్తున్న ఫ్యాన్స్ ఒక్కసారిగా బాణసంచా కాల్చడం ఆశ్చర్యాన్ని కలిగించింది. థియేటర్ మధ్యలోనే కాకుండా నలువైపులా కూడా బాణసంచా వ్యాపించడంతో అక్కడ ఒక్కసారిగా బయానక వాతావరణం కనిపించింది. ఊహించని విధంగా థియేటర్లోనే రాకెట్ తరహా షాట్స్ కూడా పేల్చడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
భయంతో పరుగులు తీసిన ఫ్యాన్స్
ఇక కొందరు అయితే ఏకంగా రాకెట్స్ తరహా టపాసులను థియేటర్లోనే పేల్చారు అని అక్కడి వారు చెబుతున్నారు. నార్త్ లోని ఒక రూరల్ థియేటర్ లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక అందుకు సంబంధించిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నలువైపులా టపాసులు పడడంతో ఊహించని విధంగా ఒక్కసారిగా మంటలు కూడా చెలరేగినట్లు అనిపించింది. దీంతో కొంతమంది ఫ్యాన్స్ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఇక అప్పటికే యాజమాన్యం చర్యలు తీసుకున్నప్పటికీ థియేటర్లో కొంత డ్యామేజ్ అయితే జరిగింది కానీ అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం అయితే జరగలేదు.


Click it and Unblock the Notifications











