1 నిమిషానికి షారుక్‌కు 10 కోట్ల రెమ్యునరేషన్.. బాలీవుడ్ బాద్షా వీడియో ట్రెండింగ్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మళ్లీ మొదలైంది. దాదాపు నాలుగు, ఐదేళ్లపాటు హిట్ లేక.. సరైనా సినిమాలు లేకుండా హైరాన పడిన విషయం తెలిసిందే. అయితే పఠాన్ సినిమాతో మళ్ళీ షారుక్ ఫామ్‌లోకి రావడం, రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టడం తెలిసిందే. పఠాన్ చిత్రంతో దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సాధించిన విషయం తెలిసిందే. అయితే పఠాన్ చిత్రంలోని డ్యాన్స్ చేసినందుకు రికార్డు స్థాయిలో పారితోషికం అందుకొన్నాడు. ఆ డ్యాన్స్ ఎక్కడ చేశాడు? ఎందుకు చేశాడనే వివరాల్లోకి వెళితే..
పఠాన్ కలెక్షన్ల వర్షం : వరుస ఫ్లాపులతో బేజారెత్తిన బాలీవుడ్‌కు షారుక్ ఖాన్ మరోసారి ఉత్తేజం తెప్పించాడు. ఆయన నటించిన పఠాన్ చిత్రం హిందీ పరిశ్రమలో కలెక్షన్ల పరంగా నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా 1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించి మళ్లీ షారుక్ ఖాన్‌ను నంబర్ వన్ స్థానంలో నిలపడమే కాకుండా హిందీ సినిమా పరిశ్రమకు ఊపిరిపోసింది. ఈ సినిమాలోని పాటలు వైరల్ అయ్యాయి.

పఠాన్ మూవీ పాటలు ఫేవరేట్‌గా : పఠాన్ చిత్రంలోని జూమే జో పఠాన్ పాట మ్యూజిక్ రంగంలో టాప్ లేపింది. ఈ పాటకు మిలియన్ల కొద్ది వ్యూస్ యూట్యూబ్‌లో వచ్చాయి. ఈ పాటకు సోషల్ మీడియాలో లక్షలాది రీల్స్ క్రియేట్ అయ్యాయి. ఈ పాట షారుక్ ఫ్యాన్స్‌కు ఫేవరేట్‌గా మారిపోయింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఈ పాటకు స్టెప్పులేసి.. మరింతగా పాపులారిటిని సొంతం చేసుకొన్నది.
నీతా అంబానీ నిర్వహించిన వేడుకలో : ఇటీవల దేశంలోనే పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ సతీమణి నీతా ముఖేష్ అంబానీ ఓ కల్చరల్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కల్చరల్ సెంటర్‌కు నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ అని నామకరణం చేశారు. ఈ వేడుకలో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు, హీరోయిన్లందరూ భారీగా తరలివచ్చారు. ఈ వేడుకలో సినీ తారలందరూ డ్యాన్సులు చేసి.. పాటలు పాడి హంగామా చేశారు.

షారుక్ ఖాన్‌కు రికార్డు రెమ్యునరేషన్ : ఇక షారుక్ ఖాన్ తనకు భారీ విజయాన్ని అందించిన పఠాన్ చిత్రంలోని జూమే జో పఠాన్ పాటకు స్టెప్పులేశారు. ఈ పాటకు డ్యాన్స్ చేసినందుకు షారుక్ ఖాన్‌కు భారీగా రెమ్యునరేషన్ అందజేశారు. మీడియా కథనాల ప్రకారం..షారుక్ ఖాన్ ఒక నిమిషం పాటు స్టెప్పులేసినందుకు దాదాపు 10 కోట్ల రూపాయలు ఇచ్చారనే విషయం సెన్సేషనల్‌గా మారింది.
షారుక్‌తోపాటు వరుణ్, రణ్‌వీర్ : సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన షారుక్ ఖాన్ వీడియోలో వరుణ్ ధావన్, రణ్‌వీర్ సింగ్ కూడా కనిపించారు. షారుక్ ఖాన్‌తో కలిసి రెచ్చిపోయి వరుణ్, రణ్‌వీర్ స్టెప్పులేశారు. ఈ ముగ్గురు స్టేజ్ మీద స్టేప్పులేస్తుండగా.. వేదిక ముందున్న వారందరూ విజిల్స్ వేసి.. కేరింతలు కొట్టారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో మీడియాలో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











