అక్షయ్ భారీ విరాళం.. షారుక్ ఖాన్ మెడకు చుట్టుకుందా?.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్

కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు సాయం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని అలా ప్రకటించడం ఆలస్యం అక్షయ్ కుమార్ ఇలా రంగంలోకి దిగిపోయాడు. ఇంత వరకు ఏ సెలెబ్రిటీ ఇవ్వనంత మొత్తాన్ని విరాళంగా ప్రకటించడం అందరికీ తెలిసిందే. పీఎం కేర్ అంటూ విరాళాలు అర్థించగా.. రూ. 25 కోట్ల భారీ మొత్తాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ..

సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ..


అక్షయ్ కుమార్ రూ. 25 కోట్లు విరాళంగా ప్రకటించాడనే వార్త శరవేగంగా విస్తరించింది. రియల్ హీరో అంటూ నెటిజన్ల కామెంట్లతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఈ ఒక్కటే కాదు అక్షయ్ ఇప్పటివరకు పుల్వామా దాడి జరిగినప్పుడు ఐదు కోట్లు, అస్సాం వరదల సమయంలో రెండు కోట్లు, చెన్నై వరదల సమయంలో ఒక కోటి ఇలా అక్షయ్ చేసిన దానాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

షారుక్ ఖాన్ టార్గెట్..


అయితే అక్షయ్ కుమార్ ప్రకటించిన భారీ విరాళం షారుక్ ఖాన్ మెడకు చుట్టుకుంది. అక్షయ్ విరాళం ప్రకటించాడు గానీ, షారుక్ ఖాన్ ఇంత వరకు ప్రకటించలేదని టార్గెట్ చేస్తున్నారు. ఈ వివిదాంలోకి మరికొందరు మతాన్ని కూడా లాగేస్తున్నారు. షారుక్ ఖాన్ ముస్లిం కావడం వల్లే ఈ మేరకు టార్గెట్ చేస్తున్నారని ఆయన అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.

గుప్తంగా దానం..


అయితే షారుక్ మాత్రం ఏది చేసినా గుప్తంగానే చేస్తాడని, పబ్లిసిటీ చేసుకోవడం తనకు ఇష్టం ఉండదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు, ఈ మేరకు ఆయన మాట్లాడిన పాత వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. చారిటీ, అయినా సామాజిక సేవ ఏది చేసినా బయటకు చెప్పడం తనకు ఇష్టం ఉండదని, మరీ ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఊదరగొట్టడం తనకు నచ్చదని చెప్పుకొచ్చిన వీడయో తెగ వైరల్ అవుతోంది.

ఎంతో మందికి సాయం..

ఎంతో మందికి సాయం..

అయితే షారుక్ చేసిన దానాల గురించి ఆయన ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. చెన్నై వరదల సమయంలో ఆయన కోటి రూపాయలు విరాళం ఇచ్చారని, సైనిక కుటుంబాలను ఆదుకోవడానికి ఆర్థిక సాయాన్ని అందించడాని, అందుకే నిర్మలా సీతారామన్ కూడా ప్రత్యేకంగా అభినందించిందని, కేరళలో వరదలు సంభవించినప్పుడు కూడా స్పందించాడని.. షారుక్ పట్ల నెగెటివిటీని ఆపండని ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X