కింగ్ షూటింగ్‌లో షారుక్‌కు ప్రమాదం.. చికిత్స కోసం అమెరికాకు పయనం

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు తీవ్ర ప్రమాదం చోటు చేసుకొన్నది. కింగ్ సినిమా షూటింగులో ఆయన గాయపడటంతో హుటాహుటిన స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు తెలపడంతో ఆయన అమెరికాకు ప్రయాణమయ్యారు అని తెలిసింది. అయితే ఘటన గురించి షారుక్ పీఆర్ వర్గాలు అధికారికంగా స్పందించడంతో ఆయనకు అయిన గాయం ఎలాంటిది? ఏం జరిగింది అనే విషయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తతో అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్ సినిమా షూటింగ్ ముంబైలోని ఫిల్మ్ స్టూడియోలో జరుగుతున్నది. ఆయనతోపాటు మరికొందరు ఫైటర్స్‌పై ఇంటెన్స్ యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు కాలికి గాయమైంది. ఆ సమయంలో తన కూతురు సుహానా కూడా ప్రమాద స్థలంలో ఉన్నారు. అయితే ఆయనకు జరిగిన గాయం అంత సీరియస్ కాదు. కానీ అత్యవసరంగా చికిత్స అవసరం. దాంతో ఆయన అమెరికాకు తరలించారు అని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

Shah Rukh Khan injured

కాలి కండరాలకు గాయం కావడంతో వైద్యులు ఒక నెలపాటు విశ్రాంతి అవసరం. అమెరికాలో మెరుగైన చికిత్స అవసరం కారణంగా మరో నెలపాటు షూటింగ్‌కు దూరంగా ఉంటారు. జూలై, ఆగస్టులో భారీగా షెడ్యూల్ ప్లాన్ చేశారు. దాంతో తాత్కాలికంగా షూటింగ్‌ను వాయిదా వేశారు. గాయం తీవ్రత పూర్తిగా తగ్గిన తర్వాత సెప్టెంబర్‌లో ఆయన షూటింగులో పాల్గొనే అవకాశం ఉంది అనే వార్త బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.

ఈ ఏడాదిలో షారుక్ గాయపడటం ఇది మొదటిసారి కాదు. ఈ సంవత్సరం ఆరంభంలో భుజానికి గాయం కావడంతో నలుపు రంగు పట్టి వేసుకొని కనిపించారు. ఆ సమయంలో అ బ్యాండేజ్‌తోనే అభిమానులకు అభివాదం చేశారు. తాజాగా మరోసారి ఆయన గాయపడటంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

జవాన్, పఠాన్ సినిమాల తర్వాత షారుక్ నటిస్తున్న కింగ్ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా సుహానా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నది. ఈ సినిమాలో దీపిక పదుకోన్, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, జైదీప్ అహ్లవాత్, అనిల్ కపూర్, అర్షద్ వార్సీ, జాకీ ష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Read more about: shah rukh khan king suhana khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X