మూడేళ్ల తర్వాత కూడా షారుక్ ఖాన్‌కు మోక్షం లభించదా? మరోసారి పఠాన్ షూటింగ్‌కు బ్రేక్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2018లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన జీరో మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టడంతో సినిమాలకు దూరం అయ్యారు. ఈ క్రమంలో కరోనావైరస్ వల్ల లాక్‌డౌన్ విధించడంతో మరింత గ్యాప్ ఏర్పడింది.

పఠాన్‌కు కరోనా అడ్డంకి
లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై దీపిక పదుకోన్, జాన్ అబ్రహంతో కలిసి పఠాన్ చిత్రంలో నటిస్తున్నారు. అయితే షారుక్ షూటింగుకు మళ్లీ కరోనా పరిస్థితులు అడ్డుపడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ మరోసారి వాయిదా పడటం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

షారుక్ ఖాన్ హోం క్వారంటైన్‌లో
పఠాన్ షూటింగులో పాల్గోన్న యూనిట్ సిబ్బందిలో పలువురికి కరోనావైరస్ బారిన పడటంతో షూటింగును నిలిపివేశారు. షారుక్ ఖాన్ కూడా హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్టు సమాచారం. అయితే ఈ వార్తలను యూనిట్ సభ్యులు కొట్టిపడేశారు. ముంబైలో లాక్‌డౌన్ విధించవచ్చనే వార్తల నేపథ్యంలో సెట్లో అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నాం అని తెలిపారు.

రూమర్లు ప్రచారం చేయవద్దు
ముంబైలో లాక్‌డౌన్ పెట్ట వచ్చనే రూమర్ల మధ్య రెండు రోజులపాటు షూటింగ్ వాయిదా వేశాం. ఒకవేళ లాక్‌డౌన్ విధించకపోతే మళ్లీ కొత్తగా షెడ్యూల్ ప్రారంభిస్తాం. కోవిడ్ నిబంధనలు, ప్రోటోకాల్స్ అనుసరిస్తూ షూటింగ్ చేస్తున్నాం. అయితే మా షూటింగు గురించి రూమర్లు ప్రచారం చేయడం అన్యాయం అంటూ యూనిట్ సిబ్బంది స్పందించారు.

షారుక్ ఖాన్ అసంతృప్తి
ఇదిలా ఉండగా, షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొన్న షారుక్ ఖాన్ ఐపీఎల్ 14వ సీజన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. గెలిచే పొజిషన్ నుంచి ఓటమి బారిన పడిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటతీరుపై షారుక్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన టీమ్ బాధ్యతారాహిత్యంగా ఆడటంపై ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులకు క్షమాపణ చెప్పారు.


Click it and Unblock the Notifications











