షారుఖ్ ఇంటి నేమ్ ప్లేట్ మిస్సింగ్.. దాంతో ఇల్లే కొనేయచ్చు తెలుసా?

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ విలాసవంతమైన బంగ్లా అయిన మన్నత్ వెలుపల ఉన్న కొత్త నేమ్ ప్లేట్ కనిపించకుండా పోయింది. కొంత కాలం క్రితం గౌరీ ఖాన్, షారుఖ్ కలిసి తమ ఇంటి నేమ్ ప్లేట్ మార్చారు. అప్పట్లో వారి నివాసం వద్ద ఆ నేమ్ ప్లేట్‌ను చూసిన చాలా మంది అభిమానులు ఈ కొత్త నేమ్ ప్లేట్‌ బాగుందని ప్రశంసించారు. అయితే ఇప్పుడు ఆ నేమ్‌ ప్లేట్‌ కనిపించకుండా పోవడంతో అభిమానులు అవాక్కయ్యారు. దీంతో మన్నత్ నేమ్ ప్లేట్ ఎక్కడికి పోయింది అని ట్విటర్‌లో కూడా ట్రెండ్ అయింది అంటే అర్ధం చేసుకోవచ్చు. అసలు ఏమైంది? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Recommended Video

Sharukh ని Atlee కాపాడతాడా? | Pathan Movie కి 100 కోట్లు || Filmibeat Telugu
నేమ్ ప్లేట్ కారణంగా

నేమ్ ప్లేట్ కారణంగా

బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ లాగే ఆయన నివాసం ఇల్లు 'మన్నత్' కూడా అభిమానులలో బాగా ప్రాచుర్యం పొందింది. గత కొన్ని రోజులుగా, ఆయన నివాసం కూడా దాని నేమ్ ప్లేట్ కారణంగా వార్తల్లో ఉంది. కొంతకాలం క్రితం ఈ ఇంటి నేమ్ ప్లేట్ మార్చబడింది, అప్పుడు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దానికి కారణం అది డైమండ్స్ తో తయారు చేయడమే.

మాయమైందనే వార్త

మాయమైందనే వార్త


డైమండ్స్ పొదిగిన ఆ నేమ్ ప్లేట్ ఖరీదు పాతిక లక్షలు. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ డబ్బుతో ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. ఇదే శీర్షికతో మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు హఠాత్తుగా 'మన్నత్' నేమ్ ప్లేట్ మాయమైందనే వార్త తెరపైకి రావడం అభిమానులను కలవరపెడుతోంది. 'మన్నత్' బయట నేమ్ ప్లేట్ కనిపించని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వచ్చాయి.

ఇదే మొదటిసారి

ఇదే మొదటిసారి


అయితే దొంగతనం జరిగిందని ప్రచారం జరుగుతూ ఉండగా అది నిజం కాదని అంటున్నారు. మీడియా కథనాల ప్రకారం, షారుఖ్ ఖాన్ ఇంటి 'మన్నత్' నేమ్ ప్లేట్ మరమ్మతుకు వెళ్లింది. నిజానికి, నేమ్ ప్లేట్ నుండి వజ్రం మిస్ అయిందట. అందుకే దానిని మరమ్మతుల కోసం పంపబడిందని అంటున్నారు. వీలైనంత త్వరగా ఇంటి వెలుపల ఈ నేమ్ ప్లేట్ అమర్చబడుతుంది. ఇక 'మన్నత్' వెలుపల నేమ్ ప్లేట్ లేకపోవడం ఇదే మొదటిసారి అని, ఈ కారణంగా షారుక్ ఖాన్ అభిమానులు కూడా చాలా బాధ పడుతున్నారని అంటున్నారు.

నేమ్ ప్లేట్ కావాలని

నేమ్ ప్లేట్ కావాలని


షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఒక ప్రసిద్ధ ఇంటీరియర్ డిజైనర్, ఆమె తన ఇంటిని చాలా అందంగా ఉంచుకోవడానికే చూస్తుంటారు. ఈ క్రమంలోనే గౌరీ ఖాన్ పర్యవేక్షణలో 'మన్నత్' అనే అద్భుతమైన నేమ్ ప్లేట్ తయారు చేయబడింది. గౌరీ ఖాన్ తన ఇంటికి ఒక క్లాసీ నేమ్ ప్లేట్ కావాలని డైమండ్స్ తో సిద్ధం చేశారు. ఈ నేమ్ ప్లేట్ ధర 20 నుంచి 25 లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం.

 ఎంతో ఆసక్తిగా

ఎంతో ఆసక్తిగా


షారుఖ్ ఖాన్ ప్రాజెక్ట్‌ల గురించి చెప్పాలంటే ఆయన యష్ రాజ్ పఠాన్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఆయనతో పాటు దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కూడా నటించనున్నారు. అలాగే, షారుఖ్ రాజ్‌కుమార్ హిరానీ డంకీ, దర్శకుడు అట్లీ 'లయన్‌'లో కూడా కనిపించనున్నారు. షారుఖ్ చివరిసారిగా 2018లో వచ్చిన జీరో చిత్రంలో కనిపించారు. అప్పటి నుంచి ఆయన ఎప్పుడు తెరపైకి వస్తారా? అని వచ్చేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X