షారుఖ్ ఖాన్ మన్నత్.. ఆ ఇంట్లో ఉండాలంటే ఒక్కరాత్రికే ఎన్ని లక్షలు కట్టాలో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరో, కింగ్ ఖాన్ ఎప్పుడు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇంట్రెస్టింగ్ విషయాల ద్వారా తన అభిమా నులను ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు. ఇక తాజాగా షారుఖ్ ఖాన్ కు సంబంధించిన విలాసవంతమైన, అత్యంత ఖరీదైన, ఇండియాలోనే మూడవ ప్రసిద్ధ బిల్డింగ్ గా గుర్తింపు పొందిన మన్నత్, అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఉన్న మ్యాన్షన్ భవనం ద్వారా షారుక్ ఖాన్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. షారుక్ ఖాన్ కు సంబంధించిన విలాసవంతమైన భవనాల్లోనీ లాస్ ఏంజెల్స్ లో గల మాన్షన్ భవనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇప్పుడు ఈ విలాసవంతమైన భవనంలో ఎవరైనా ఉండే అవకాశం కల్పించారు. ఇక ప్రస్తుతం Airbnb లో రెంటుకు అందుబాటులో ఉంచారు. అయితే ఈ భవనంలో ఒకరోజు నిద్రించాలంటే ఎవరైనా సరే అక్షరాల 1,96,891 అద్దెగా చెల్లించాల్సి ఉంటుంది. లాస్ ఏంజిల్స్‌లోని షారుఖ్ ఖాన్ విలాసవంతమైన ఈ భవనాన్ని బెవర్లీ హిల్స్ అని కూడా పిలుస్తారు. ఈ మాన్షన్ లో ఆరు విశాలమైన బెడ్ రూములు ఉంటాయి. విశాలమైన జాకుజీస్, ప్రైవేట్ క్యాబానాలు, ఒక భారీ కొలను, ఒక ప్రైవేట్ టెన్నిస్ కోర్టు కూడా ఉండటం విశేషం. శాంటా మోనికా, రోడియో డ్రైవ్, వెస్ట్ హాలీవుడ్ నుంచి అతి సమీపంలో ఉంటుందీ భవనం.

షారుఖ్ ఖాన్ కు ఉన్న భవనాల్లో ఇది అత్యంత ఖరీదైన భవనం. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలోనే షారుక్ ఖాన్ ముంబైలోని తన మన్నత్ ను కూడా ఖాళీ చేసినట్టు బాలీవుడ్ మీడియా కథనాలను పబ్లిష్ చేసింది. ముంబైలోని మరో రెండు ఖరీదైన అపార్ట్ మెంట్ లను అద్దెకు తీసుకొని తన మన్నత్ ను పునరుద్ధరిస్తున్నట్టు తెలుస్తోంది. మేలో పునరుద్ధరణ పనులు జరగబోతున్నాయి. ఇలా ఇండియాలో అత్యంత ఖరీదైన ఇల్లు కలిగి ఉన్న బాలీవుడ్ హీరోగా షారుఖ్ ఖాన్ రికార్డులోకి ఎక్కారు. ఆయన మన్నత్ రూ.200 వాల్యూ చేస్తుంది.
బాలీవుడ్ అత్యంత ఖరీదైన ఇంటిని కలిగి ఉన్నది మాత్రం సైఫ్ అలీఖాన్. ఆయన ప్యాలెస్ ధర రూ.800 కోట్ల వరకు ఉంటుంది. ఏదేమైనా బాలీవుడ్ స్టార్స్ తమ స్థాయికి తగ్గట్టుగా విలాసవంతమైన భవనాలను కలిగి ఉండటం ఆసక్తికరమైన విషయం. ఇక షారుక్ ఖాన్ చివరిగా జవాన్ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ.1100 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది.
ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నుంచి డంకీ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోని సలార్ చిత్రానికి పోటీగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కానీ సలార్ మీద డంకీ సినిమా నిలువలేకపోయింది. నెక్స్ట్ షారుఖ్ ఖాన్ తన హిట్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో కింగ్ అనే చిత్రంలో నటించబోతున్నారు. జూన్ నుంచి మళ్లీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది అని తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











