twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాపుల షారుక్‌తో చేతులు కలిపిన సెన్సేషనల్ సౌత్ డైరెక్టర్.. సక్సెస్ కొట్టేలా చేస్తాడా?

    |

    బాలీవుడ్ బాద్‌షా.. ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలాడు. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ ఇలా ఖాన్ త్రయం బాలీవుడ్‌ను శాసిస్తూ ఉండగా.. కాలం కలిసి రాక షారుక్‌కు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఇక షారుక్ సినిమాలంటే ఎవ్వరూ పట్టించుకునే నాథుడే లేడు అనేంతగా దిగజారిపోయాడు.

    వరుస ప్లాఫులతో వెనుకబడ్డ హీరో..

    వరుస ప్లాఫులతో వెనుకబడ్డ హీరో..

    చెన్నై ఎక్స్‌ప్రెస్ తరువాత ఒక్క హిట్టంటే ఒక్కటి కూడా తీయలేకపోయాడు. చేసిన ప్రతీ సినిమా బెడిసికొట్టింది. దిల్‌వాలే చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వద్దామని చూసినా అది ఫలించలేదు. ప్రయోగాలకు అంతగా దూరముండే షారుక్ కొత్తగా ట్రై చేసి మరగుజ్జు పాత్రను కూడా పోషించాడు. జీరో అంటూ నిజంగానే జీరో అయిపోయాడు.

    సినిమాలకు దూరంగా ఉందామనే నిర్ణయం..

    సినిమాలకు దూరంగా ఉందామనే నిర్ణయం..

    ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతుండటంతో విసిగెత్తిన షారుక్.. పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. జీరో వచ్చి ఏడాది గడుస్తున్నా.. మరో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయకపోవడంతో ఈ వార్తలకు ఊతమిచ్చినట్లైంది.

    అప్పట్లో అట్లీని కలవడంతో..

    అప్పట్లో అట్లీని కలవడంతో..

    క్రికెట్ వీక్షించడానికి చెన్నైకి వెళ్లిన షారుక్.. డైరెక్టర్ అట్లీని కలిశాడు. అయితే అప్పుడు బయటకు వచ్చిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సినిమా కోసం కలిశాడని కొందరు, కాదు మర్యాదపూర్వంగానే కలిశారని మరికొందరు ఇష్టమొచ్చిన వార్తలు రాశారు.

    సక్సెస్ జోషల్ ఉన్న అట్లీ..

    సక్సెస్ జోషల్ ఉన్న అట్లీ..

    రాజా రాణి సినిమాతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లోనూ మంచి పేరు, ఫేమ్ సంపాదించుకున్నాడు అట్లీ. ఆ తరువాత తేరి(పోలీసోడు), మెర్సెల్ (అదిరింది) చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించాడు. ఇక త్వరలోనే బిగిల్ (విజిల్) అంటూ మరోసారి హిట్టుకొట్టేందుకు రెడీ అయ్యాడు.

    షారుక్‌తో సినిమా అంటూ జోరుగా ప్రచారం..

    షారుక్‌తో సినిమా అంటూ జోరుగా ప్రచారం..

    ఈ మూవీ ట్రైలర్‌ను షారుక్.. షేర్ చేయడం.. ప్రశంసలు కురిపించడంతో అట్లీతో సినిమా ఉంటుందనే వార్తలు గుప్పుమన్నాయి. విజిల్ సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతుండటంతో అట్లీ.. తన తదుపరి చిత్రాన్ని షారుక్‌తో తెరకెక్కించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే ఇదే జరిగితే.. ఇన్నేళ్లకు మళ్లీ షారుక్‌కు ఓ హిట్ ఇచ్చి పూర్వ వైభవాన్ని తెప్పిస్తాడేమోనని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

    English summary
    Shah Rukh Khan Will Act In Atlee Direction. THis News Goes Viral In Socil Media, After His Bigil Project Atlee May Direct Sha Rukh Khan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X