అంత చిన్న ఇంటిలోనా అని సెటైర్.. నా ఇంటి విలువ ఎంతో తెలుసా? అంటూ షారుక్ ఝలక్
దేశంలోనే అత్యంత సంపన్నుడైన హీరోల్లో షారుక్ ఖాన్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. బాలీవుడ్ బాద్షా అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే షారుక్ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ముంబై సముద్ర తీరంలో తనకు ఇష్టమైన బంగ్లా విలువను ఇటీవల వెల్లడించాడు. జీరో సినిమా ప్రమోషన్ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ..

అపార్ట్‌మెంట్‌లోని చిన్న ఫ్లాట్‌లో
సినిమా రంగంలో స్థిరపడేందుకు నేను ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చాను. అప్పటికే నాకు పెళ్లైంది. అప్పుడు భార్యతో చిన్న అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో నివసించే వాడిని. కానీ ఢిల్లీలో అపార్ట్ మెంట్ కల్చర్ తక్కువ. ఢిల్లీవాసులు డబ్బులు లేకపోయినా ఓ చిన్న ఇంటిని కొనుకొనేందుకు మక్కువ చూపేవారు.

మా అత్త సెటైర్‌తో
నేను చిన్న అపార్ట్‌మెంట్‌లో నివసించడాన్ని చూసి నా భార్య గౌరీ తల్లిగారు మీరు ఇంత చిన్న ఇంటిలోనా ఉండేది అని పదే పదే అనేవారు. దాంతో మా అత్తకు నచ్చే విధంగా భారీ బంగ్లాను కొనాలని అనుకొన్నాను. ప్రస్తుతం ఉంటున్న మన్నత్ బంగ్లాను కొనడానికి మా అత్త కారణం అని షారుక్ వెల్లడించారు.

మన్నత్ విలువ రూ.200 కోట్లు
ముంబై సముద్ర తీరంలో ఉన్న మన్నత్ బంగ్లా నాకున్న ఆస్తుల్లో అత్యంత విలువైనది. ధాని విలువ సుమారు రూ.200 కోట్లు ఉండవచ్చు. ఆ బంగ్లా అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. దానికంటే విలువైనది మరోకటి లేదు అని షారుక్ పేర్కొన్నారు.

మన్నత్‌ను ఎంతకు కొన్నారంటే
మన్నత్ బంగ్లాను గతంలో విల్లా వియన్నా అని పిలిచేవారు. షారుక్ కొనుగోలు చేయడానికి ముందు గుజరాత్‌కు చెందిన పార్శీ మతస్తుడు కేకూ గాంధీ దానికి యజమాని. కేకూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఆ బంగ్లాను షారుక్ రూ.13.32 కోట్లకు కొనుగోలు చేశాడు.

బాక్సాఫీస్ వద్ద జీరో మూవీ బోల్తా
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ నటించిన జీరో చిత్రం డిసెంబర్ 21న విడుదలైంది. ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో కత్రినా కైఫ్, అనుష్క శర్మ నటించారు. అయితే ఈ చిత్రంపై ప్రేక్షకులు, సినీ విమర్శకులు పెదవి విరచడంతో బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజాయాన్ని చవిచూసింది.


Click it and Unblock the Notifications











