నీకు యాక్టింగే రాదు.. క్రేజీ హీరోయిన్‌ని తిట్టిన హీరో.. రేప్ సీన్‌లో అలా మ్యానేజ్ చేశారు!
Recommended Video

బాలీవుడ్ లో ఒకప్పటి మోస్ట్ రొమాంటిక్ జోడి అనగానే వెంటనే షారుఖ్, కాజోల్ జంట గుర్తుకు వస్తుంది. వీరి కాంబినేషన్ లో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. దిల్ వాలే దూల్హేనియా లే జాయేంగే చిత్రం అయితే ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో షారుఖ్, కాజోల్ జంట బాలీవుడ్ లో క్రేజీగా మారిపోయారు. రియల్ లైఫ్ లో కూడా షారుఖ్, కాజల్ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. అంతలా వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. తన కెరీర్ ఆరంభంలో షారుఖ్ సైతం తనని తిట్టాడని రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కాజోల్ వెల్లడించింది.

షారుఖ్‌తో తొలిసారి
కాజల్, షారుఖ్ కలసి తొలిసారి భాజిగర్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం 1993 లో విడుదలయింది. అప్పటికి కాజోల్ ఇంకా పాపులర్ కాలేదు. బాలీవుడ్ లోకి కొత్తగా అడుగుపెట్టి సినిమాలు చేయడం ప్రారంభించింది. ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సంఘటనని కాజోల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

షారుఖ్ తిట్టిన సందర్భం
భాజిగర్ చిత్ర షూటింగ్ సమయంలో షారుఖ్ ఖాన్ తో ఓ చేదు ఘటన ఎదురైంది. ఓ ఎమోషనల్ సన్నివేశం షూట్ చేస్తున్నారు. నా నటన సరిగ్గా లేదని షారుఖ్ తిట్టాడు. నాకు మాత్రం చాలా అద్భుతంగ నటించానని అనిపించింది. షారుఖ్ అనవసరంగా తిట్టాడని భాదపడ్డట్లు కాజోల్ తెలిపింది.

ఈ చిత్రాలకు పనికిరావని
కొంతమంది సన్నిహితులు కూడా తాను ఎమోషనల్ చిత్రాలకు పనికిరానని అన్నారు. హీరోతో డ్యూయెట్స్, కొన్ని సన్నివేశాలు ఉండే సినిమాలు బెటర్ అని సలహా ఇచ్చారు. వారి మాటలని సీరియస్ గా తీసుకుని ఆ తరువాత ఎమోషనల్ చిత్రాల్లో సైతం రాణించానని కాజోల్ తెలిపింది.

నా వల్ల కాదు
ఇక 1998లో విడుదలైన దుష్మన్ చిత్రంలో కూడా తాను ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నానని కాజోల్ తెలిపింది. ఆ చిత్రంలో ఓ రేప్ సీన్ లో నటించాలి. ఆ సన్నివేశంలో తనని తాను ఊహించుకోవడం కష్టంగా అనిపించింది. నేను చేయలేను అని చెప్పేశా. అలాంటి సన్నివేశంలో కనిపించడం నావల్ల కాదని నిర్మాతకు, దర్శకుడికి చెప్పేశానని కాజోల్ తెలిపింది.

అలా మ్యానేజ్ చేశారు
దర్శకుడు తనూజ చంద్ర, పూజ భట్ నన్ను రిక్వస్ట్ చేశారు. అయినా అంగీకరించలేదు. ఇక చేసేది లేక.. కేవలం ఒక క్లోజ్ అప్ షాట్ ఇవ్వండి.. మిగిలినది అంతా బాడీ డబుల్ తో మ్యానేజ్ చేసుకుంటాం అని చెప్పడంతో అంగీకరించానని కాజోల్ తెలిపింది. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో తన పాత సంగతులని గుర్తు చేసుకుంది.


Click it and Unblock the Notifications











