twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అట్లి సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్న బాలీవుడ్ బాద్షా ...

    |

    బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్ సినిమా నిరాశపరచడం తో కొంత గ్యాప్ తీసుకున్నాడు షారుక్. ఈ సారి కథ విషయంలో దర్శకుడి విషయంలో చాలా జాగ్రత్తలు వస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న అట్లీ డైరెక్షన్ లో షారుక్ ఓ సినిమా చేయబోతున్నాడు. కోలీవుడ్ దర్శకులు బాలీవుడ్ లో సినిమాలు చేయడం కొత్తేమి కాదు.

    బాలచందర్, బాలు మహేంద్ర, శంకర్, మురుగదాస్, బాల ఇలా ఎందరో కోలీవుడ్ దర్శకులు బాలీవుడ్ లో సినిమాలు చేసి మెప్పించారు. ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ఇక అట్లీ విషయానికొస్తే కోలీవుడ్ లో రాజారాణి, తేరి, మెర్సల్, ఇప్పుడు బిజిల్ సినిమాలు చేశాడు. ఈ నాలుగు సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి.

    Shah Rukh Khan playing a double role in Atlees next

    బిజిల్ సినిమాకు బాలీవుడ్ ఫిదా అయ్యింది. దాంతో షారుక్ పిలిచిమరీ అట్లీ కి సినిమా ఇచ్చాడని టాక్ . అయితే ఈ సినిమాలో షారుక్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది.

    ఇందులో షారుక్ ఒక పాత్రలో ఇన్వస్టిగేషన్ ఆఫీసర్ గా మరో పాత్రలో క్రిమినల్ గా కనిపించనున్నాడని బాలీవుడ్ వర్గాలనుండి అందుతున్న సమాచారం. దీనితో పాటు యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న పఠాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు షారుక్ . ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

    English summary
    Shah Rukh Khan is reportedly playing a double role in south filmmaker Atlee's next action-thriller.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X