షూటింగ్‌లో బాయ్‌ఫ్రెండ్ రచ్చ .. సినిమా నుంచి ఐశ్వర్యరాయ్‌ని తీసేసిన స్టార్ హీరో
భారతీయ సినిమాకు ఐకాన్‌గా ఉన్న స్టార్స్‌లో విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ కూడా ఒకరు. దశాబ్ధాలుగా తన అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ 50 ప్లస్‌లోనూ తరగని అందంతో మెరిసిపోతున్నారు. వయసు పైబడుతున్నా ఐశ్వర్యరాయ్‌కు ఆఫర్లు క్యూకడుతూనే ఉన్నాయి. టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో ఇప్పటీకీ ఆమె మోస్ట్ వాంటెడ్ నటి. ఐష్ ఎంత కొరితే అంత ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉంటారంటే అతిశయోక్తి కాదు. అలాంటిది ఐశ్వర్యరాయ్‌ని ఓ హీరో తన సినిమాలో నుంచి తీసేశారట. ఈ వివరాల్లోకి వెళితే..
మిస్ వరల్డ్ కిరీటం సాధించిన ఐశ్వర్యరాయ్
కర్ణాటకలోని మంగళూరులో పుట్టి పెరిగిన ఐశ్వర్య చదువుకుంటూనే మోడలింగ్ వైపు అడుగులు వేశారు. తొలుత మిస్ ఇండియా పోటీల్లో తన అదృష్టం పరీక్షించుకున్న ఆమె సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. ఆ తర్వాత అన్ని రకాల మెళకువలు నేర్చుకుని, పూర్తి సంసిద్ధతతో 1994లో మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఐష్ బాటలో ఎంతో మంది భారతీయ అమ్మాయిలు ఈ అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు.
బాలీవుడ్‌కు ఐకాన్‌గా
దేశంలోనే టాప్ మోడల్‌గా వెలుగొందుతున్న దశలో సినిమాల్లో అడుగుపెట్టిన ఐశ్వర్యరాయ్ 1997లో తమిళ చిత్రం ఇద్దరుతో పరిచయమయ్యారు. అనంతరం హిందీలో ఔర్ ప్యార్ హో గయా, తమిళ్‌లో జీన్స్ చిత్రాలతో ఆమె పేరు మారుమోగింది. వరుస హిట్లతో బాలీవుడ్‌లో నెంబర్‌వన్ హీరోయిన్‌గా ఎదిగారు. కేన్స్ సహా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో రెడ్ కార్పెట్‌పై ర్యాంప్ వ్యాక్ చేస్తూ రెచ్చిపోయింది ఐశ్వర్యరాయ్. ధూమ్-2 షూటింగ్ సమయంలో అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడిన ఐష్.. 20 ఏప్రిల్ 2007లో ఆయనను పెళ్లాడారు. 2011లో వీరికి కుమార్తె ఆరాధ్య జన్మించింది. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన ఐశ్వర్యరాయ్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో తన వయసు, ఇమేజ్‌కు తగ్గ పాత్రలు పోషిస్తున్నారు.

సల్మాన్‌తో ప్రేమాయణం
అయితే అభిషేక్ బచ్చన్‌కు ముందు ఐశ్వర్యరాయ్ పలువురితో ప్రేమాయణం నడిపించింది. రాజీవ్ ముల్చాందనీ, సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్, హృతిక్ రోషన్ హాలీవుడ్ నటుడు మార్టిన్ హెండర్సన్‌లతో ఆమె డేటింగ్ చేశారు. వీరిలో సల్మాన్ ఖాన్‌తో ఎఫైర్ ప్రత్యేకం. హమ్ దిల్ దే చుకే సనమ్ షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే ఐష్ ఎంతకీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఐశ్వర్యపై రగిలిపోయాడు సల్మాన్. అప్పటికే విడి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఐష్ డోర్ తీసేవరకు తలుపులు బాదుతూనే ఉన్నాడట. అప్పటికీ తలుపులు తీయకపోవడంతో 17వ అంతస్తు నుంచి దూకి చనిపోతానని బెదిరించడంతో ఐశ్వర్యరాయ్ తలుపు తీసింది. ఈ ఘటనపై ఐశ్వర్య తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో బాలీవుడ్‌ను కుదిపేసింది.
షారుఖ్‌ని బూతులు తిట్టిన సల్మాన్
ఇక 2003లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సరసన ఐశ్వర్యరాయ్ హీరోయిన్‌గా చల్తే చల్లే సినిమా షూటింగ్ జరుగుతోంది. ఐశ్వర్యను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిన సల్మాన్ నానా రచ్చ చేశాడు. అడ్డొచ్చిన తన మిత్రుడు షారుఖ్ ఖాన్, నిర్మాతపై బూతుల వర్షం కురిపించాడట. ఐశ్వర్యను హీరోయిన్‌గా కొనసాగిస్తే ఇదే పరిస్ధితి ఎదురవుతుందని గ్రహించిన షారుఖ్ ఇతర నిర్మాతలు ఆమెను తొలగించి ఐశ్వర్య స్థానంలో రాణి ముఖర్జీని హీరోయిన్‌గా తీసుకున్నారట. ఇది ఐశ్వర్య కెరీర్‌పై ప్రభావం చూపడంతో ఆమె తట్టుకోలేకపోయింది. దాదాపు మూడేళ్ల ప్రేమాయణానికి ముగింపు చెప్పేసింది. అంతేకాదు.. ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌తో ఏ సినిమాలోనూ నటించలేదు ఐశ్వర్యరాయ్. అలా ఓ బాలీవుడ్ ప్రేమ కథ ముగిసిపోయింది.


Click it and Unblock the Notifications











